M Venkaiah Naidu | ఇంటర్లో ద్వితీయ భాషగా సంస్కృతం.. విద్యార్థులను మాతృభాషకు దూరం చేయడం మంచిదికాదు: వెంకయ్యనాయుడు
మార్కుల కోసం విద్యార్థులను మాతృభాషకు దూరం చేయడం మంచిదికాదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు (M Venkaiah Naidu) అన్నారు. ఇంటర్ ద్వితీయ భాషగా సంస్కృతం ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసి విచారించానన్నారు.
హైదరాబాద్: మార్కుల కోసం విద్యార్థులను మాతృభాషకు దూరం చేయడం మంచిదికాదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు (M Venkaiah Naidu) అన్నారు. ఇంటర్ ద్వితీయ భాషగా సంస్కృతం ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసి విచారించానన్నారు. మార్కుల దృష్ట్యా ఉంచాలని చూస్తే మాత్రం పునరాలోచన చేయాలని సూచించారు. సంస్కృతం బోధించడంలో తప్పులేదని, సంస్కృతిని అందిపుచ్చుకునే దిశగా అమ్మభాష ఆలంబనగా నిలుస్తుదని చెప్పారు.
‘ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ స్థాయిలో ద్వితీయ భాషగా సంస్కృతం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందన్న వార్తలు విని విచారించాను. మార్కుల దృష్ట్యా ఈ నిర్ణయం అయితే మాత్రం, పునరాలోచన చేయాలని సూచిస్తున్నాను. విద్యార్థులను మన మాతృభాషకు దూరం చేయడం మంచిది కాదు. సంస్కృతాన్ని బోధించడంలో తప్పు లేదు, అదే సమయంలో మనదైన సంస్కృతిని అందిపుచ్చుకునే దిశగా అమ్మ భాష ఆలంబనగా నిలుస్తుంది. అందుకే జాతీయ విద్యావిధానం- 2020 సైతం మాతృభాషకు ప్రాధాన్యత ఇచ్చింది. ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకుని, విద్యార్థులను మాతృభాషకు మరింత చేరువ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.’ అని వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ స్థాయిలో ద్వితీయ భాషగా సంస్కృతం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందన్న వార్తలు విని విచారించాను. మార్కుల దృష్ట్యా ఈ నిర్ణయం అయితే మాత్రం, పునరాలోచన చేయాలని సూచిస్తున్నాను. విద్యార్థులను మన మాతృభాషకు దూరం చేయడం మంచిది కాదు.… pic.twitter.com/FQnGCOkbCM
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) April 11, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

