రాష్ట్రంలో ఎల్పీజీ కష్టాలు కొనసాగుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక వినియోగదారులు ఇబ్బందులు పడ్తున్నారు. తెల్లవారుజాము నుంచే గ్యాస్ ఏజెన్సీల ముందు ఖాళీ సిలిండర్లతో పడిగాపులు కాస్తున్నారు. గ్యాస్ కొరత లేదంటూ ప్రభుత్వం చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
జగిత్యాల జిల్లా మల్లాపూర్లో ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ ఎదుట మంగళవారం వినియోగదారులు ఇలా సిలిండర్లతో బారులు తీరారు. పోలీసు బందోబస్తు మధ్య సిలిండర్లు పంపిణీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఏజెన్సీల నిర్వాహకులు చెప్తున్నారు.