MLC Elections | తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
MLC elections | తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. ఐదు జిల్లాల్లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు,

హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. ఐదు జిల్లాల్లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం పోలింగ్ నమోదైంది. మొత్తంగా పోలింగ్ ముగిసే సమయానికి 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల కోటాలో కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరిగింది. పోలింగ్ ప్రక్రియను వెబ్‌క్యాస్టింగ్ చేశారు. ఈ నెల 14న ఓట్లు లెక్కించనున్నారు.
మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. మెదక్ జిల్లాలో అత్యధికంగా 96.69 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో 87.73 శాతం పోలింగ్, నల్లగొండ జిల్లాలో 83.63 శాతం పోలింగ్, ఖమ్మం జిల్లాలో 79.95 శాతం, కరీంనగర్ జిల్లాలో 72.08 శాతం పోలింగ్ నమోదైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

