వచ్చే వారంపాటు వానలు
వచ్చే వారంపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు.
- పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- హైదరాబాద్ వాతావరణ కేంద్ర డైరెక్టర్ డాక్టర్ నాగరత్న వెల్లడి
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): వచ్చే వారంపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు. మంగళవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసినట్టు పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాయంత్రం, రాత్రి సమయాల్లో జల్లులు పడే అవకాశం ఉన్నదని వెల్లడించారు. బుధవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో.. గురువారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో.. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో.. శనివారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
దోమ, మే 14 : తాగు నీటికోసం వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూర్ వాసులు రోడ్డెక్కారు. స్థానిక గాలి పోచమ్మ కాలనీకి వారం రోజులుగా తాగునీరు రాకపోవడంతో గుక్కెడు నీటికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం మోత్కూర్ నుంచి అయినాపూర్ వెళ్లే ప్రధాన రోడ్డుపై ఖాళీ బిందెలతో మహిళలు బైఠాయించారు. నీటి సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందన కరువైందని మండిపడ్డారు. ఇప్పటికైనా స్పందించి తాగు నీటి సమస్యను తీర్చాలని, లేకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

