Gurukula Entrance | ‘గురుకుల’ ప్రవేశపరీక్షల దరఖాస్తులకు రేపే తుదిగడవు.. పరీక్ష ఎప్పుడంటే..!
Gurukula Entrance | తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 15 ఆఖరు తేదీ. 2024-25 విద్యా సంవత్సరానికిగాను డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు ఈ పరీక్ష రాస్తారు. గురుకుల డిగ్రీ కాలేజీల్లో రెగ్యులర్ కోర్సులతోపాటు ఒకేషనల్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
హైదరాబాద్ : తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 15 ఆఖరు తేదీ. 2024-25 విద్యా సంవత్సరానికిగాను డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు ఈ పరీక్ష రాస్తారు. గురుకుల డిగ్రీ కాలేజీల్లో రెగ్యులర్ కోర్సులతోపాటు ఒకేషనల్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. అర్హత సాధించిన విద్యార్థులకు పూర్తి ఉచితంగా విద్యా, భోజన వసతితోపాటు యూనిఫామ్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ మొదలైనవి ఉచితంగా ఇస్తారు.
TGRDC CET 2024 పరీక్ష ద్వారా ఈ కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు. అందుకు tsrdccet.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రేపటితో దరఖాస్తుల ప్రక్రియ పూర్తికానుంది. ఇక ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 28న జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 261 జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ కోర్సులతో పాటుగా ఒకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. TGRJC CET – 2024 ద్వారా ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష కూడా ఏప్రిల్ 28న జరుగుతుంది. పరీక్షకు వారం వారం రోజులు ముందుగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

