Congress | కురియన్ గురి ఎవరిపై?.. లోక్‌సభ ఎన్నికల్లో వైఫల్యాలపై కాంగ్రెస్ త్రిసభ్య కమిటీ
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై ఆ పార్టీ అధిష్ఠానం ఏర్పాటుచేసిన కురియన్ కమిటీ ఈ నెల 10 నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీతో సమానంగా ఎనిమిది సీట్లు రావడాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది.
- త్రిసభ్య కమిటీ రాకతో కాంగ్రెస్ నేతల్లో గుబులు
- మెజార్టీ ఎంపీలు ఎందుకు గెలువలేదు?
- తప్పిదం సీఎందా? ఇన్చార్జి మంత్రులదా?
- నిగ్గుతేల్చనున్న కమిటీ
- రేపటి నుంచి క్షేత్రస్థాయిలో 3 రోజుల అధ్యయనం
Congress | హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై ఆ పార్టీ అధిష్ఠానం ఏర్పాటుచేసిన కురియన్ కమిటీ ఈ నెల 10 నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీతో సమానంగా ఎనిమిది సీట్లు రావడాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. ఇందుకు కారణం, కారకులు ఎవరన్నది నిర్ధారించేందుకు సీనియర్ నేత పీజే కురియన్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నది. కాంగ్రెస్ అభ్యర్థులు కచ్చితంగా గెలిచే సీట్లుగా అంచనావేసి ఓటమి పాలైన నియోజకవర్గాల్లో మాత్రమే కమిటీ పర్యటించనుంది. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ఓటమికిగల కారణాలు, బాధ్యులపై అధిష్ఠానానికి నివేదిక సమర్పించనుంది.
ఓడిపోయిన అభ్యర్థులను, నియోజకవర్గపు ఇన్చార్జిగా వ్యవహరించిన మంత్రిని, ఆ పరిధిలోని ఎమ్మెల్యేలను, ముఖ్యనేతలను మంత్రిపదవులు, నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న వారితో కమిటీ స్వయంగా మాట్లాడనుంది. అయితే ఈ కమిటీ అధిష్ఠానానికి ఏమి నివేదిక ఇస్తుందో?, అందులో తమ గురించి ఏమి రాస్తుందోనన్న భయం ఇప్పుడు పార్టీలో నేతలను పట్టుకుంది. ఈ నివేదిక ఆధారంగానే కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇస్తామని అధిష్ఠానం తాజాగా సంకేతాలు ఇచ్చింది. ఈ నివేదికపైనే తమ రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉందని భావిస్తున్న నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారితో పాటు ప్రస్తుత మంత్రులకు కూడా తమ శాఖలు ఉంటాయో, ఊడుతాయోనన్న భయం పట్టుకుంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కొందరి శాఖలు కూడా మారనున్నట్టు సీడబ్ల్యూసీ సభ్యుడు, మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించిన విషయం తెలిసిందే.
4 నియోజకవర్గాలలోనే అధ్యయనం
తెలంగాణలోని 17 ఎంపీ సీట్లలో14 స్థానాలు గెలిచి తీరాల్సిందేనని అధిష్ఠానం పీసీసీ నాయకత్వానికి టార్గెట్ విధించింది. కనీసం 12 సీట్లయినా కచ్చితంగా గెలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ తమదే గనుక డబుల్ డిజిట్ పక్కా అని అధిష్ఠానం ఆశించింది. కానీ, 8 సీట్లు మాత్రమే గెలుచుకోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రస్తుతం గెలిచిన 8 సీట్లతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్, ఆయన సిట్టింగ్ సీటు మల్కాజిగిరి, సికింద్రాబాద్, ఆదిలాబాద్ స్థానాలు కాంగ్రెస్ కచ్చితంగా గెలుచుకుంటుందని సునీల్ కనుగోలు చేసిన సర్వేలో కూడా తేలినట్టు సమాచారం. ఈ నాలుగు సీట్లలో పార్టీ ఎందుకు ఓటమి పాలైంది? తప్పిదం ఎక్కడ జరిగింది? ఇందుకు బాధ్యులు ఎవరు? అనే అంశంపైనే కురియన్ కమిటీ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నట్టు సమాచారం.
రేవంత్ తప్పిదమే అంటున్న మంత్రులు
పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయాల వల్లనే ఆశించిన మేరకు ఎంపీ సీట్లు గెలుచుకోలేదని మంత్రులు, ఇతర ముఖ్య నేతలు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపిక సరిగ్గా జరుగలేదని, పార్టీ నేతలను పక్కన పెట్టి ఎన్నికల ముందు చేరిన వలస నేతలకు టికెట్లు ఇవ్వడం, గెలిచే అవకాశాలను, సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకోకుండా ఒకచోట గెలిచే అవకాశం ఉంటే మరొక చోట నుంచి బరిలోకి దింపడం వంటి కారణాలే ఆశించిన ఫలితాలు రాకపోవడానికి కారణమన్నది వీరి వాదన.
మరోవైపు చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వంటివారు తమ గెలుపునకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే సహకరించారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం కూడా అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తన తండ్రి అనేక విషయాల్లో సహాయపడ్డారని, ప్రతిఫలంగానే ఆయనపై డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కొడుకు మీడియా ముఖంగా చెప్పిన విషయం తెల్సిందే. సికింద్రాబాద్, మల్కాజ్జిగిరిలలో కూడా బీజేపీ గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు సహకరించారన్న ఆరోపణలు వచ్చాయి, పీజే కురియన్ కమిటీ వీటన్నింటిపై కూలంకశంగా సమాచారాన్ని సేకరించి పార్టీ అధిష్ఠానం వద్ద పెట్టనున్నట్టు తెల్సింది.
సీరియస్‌గా తీసుకుంటుందని అనుకోలేదు
పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ అధిష్ఠానం ఇంత సీరియస్‌గా తీసుకుంటుందని అసలు ఉహించలేదని మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి పార్టీ ప్రచారం దాకా అన్నింటినీ పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి భుజాన వేసుకోవడంతో తమకు అప్పగించిన పనికే పరిమితం అయినట్టు మరొక మంత్రి చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడేమో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు ఇన్చార్జిలుగా వ్యవహరించిన మంత్రులదే బాధ్యత అంటే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. తమ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అడ్డగోలు నిర్ణయాలు తీసుకొని పార్టీ అభ్యర్థుల ఓటమికి ఇన్చార్జీలు బాధ్యత వహించాలనడం ఎంతవరకు సమంజసమని మంత్రులు వాపోతున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

