సిరిసిల్ల నేతన్నలకు అండగా నిలవండి
సిరిసిల్లలోని పవర్లూమ్ కార్మికులకు సర్కారు అండగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కోరారు. వారు ఎదురొంటున్న ఆర్థిక సమస్యలను పరిషరించేందుకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
- రూ.35.48 కోట్ల బ్యాక్ బిల్లింగ్ బకాయి మాఫీ చేసి సబ్సిడీ ఇవ్వాలి
- 101.77 కోట్ల సెస్ బకాయిలు చెల్లించాలి
- సర్కారు స్పందించకపోతే వారికి ఆత్మహత్యలే శరణ్యం
- డిప్యూటీ సీఎం భట్టికి కేటీఆర్ లేఖ
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): సిరిసిల్లలోని పవర్లూమ్ కార్మికులకు సర్కారు అండగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కోరారు. వారు ఎదురొంటున్న ఆర్థిక సమస్యలను పరిషరించేందుకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పవర్లూమ్ కార్మికులపై పడుతున్న రూ.35.48 కోట్ల బ్యాక్ బిల్లింగ్ బకాయిలను మాఫీ చేసి, వారికి రావాల్సిన రూ.101.77 కోట్ల విద్యుత్తు సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమారకు శనివారం సుదీర్ఘ లేఖ రాశారు. సిరిసిల్ల ప్రాంతం పవర్లూమ్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిందని, ఇకడ సుమారు 25 వేల పవర్‌లూమ్‌లు నడుస్తున్నాయని లేఖలో తెలిపారు. మారిన మారెట్ పరిస్థితులతో బతకలేక ఆత్మహత్యలే శరణ్యం అనుకున్న సిరిసిల్ల నేతన్నల తలరాత మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరల పథకం తీసుకొచ్చామని గుర్తుచేశారు. ప్రస్తుతం పవర్లూమ్ యూనిట్లు ఎదురొంటున్న సమస్యలు కార్మికులను తిరిగి ఆత్మహత్యల వైపు నెడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
హైకోర్టు ఆదేశాలతో పెరిగిన భారం
కుటీర పరిశ్రమల క్యాటగిరీ కింద 50% విద్యుత్తు టారిఫ్ సబ్సిడీ పొందుతున్న యూనిట్లు, అవగాహన లోపంతో స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీ (ఎస్ఎస్ఐ) యూనిట్లుగా మారడంతో ఇండస్ట్రీ-3 క్యాటగిరీ కిందకు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాల మేరకు 127 ఎస్ఎస్ఐ యూనిట్లకు, 191 ఇతర యూనిట్లకు మొత్తం రూ.35.48 కోట్లు బ్యాక్ బిల్లింగ్ బకాయిలు పడ్డాయని గుర్తుచేశారు. ఈ భారీ మొత్తాన్ని చెల్లించే స్థితిలో కార్మికులు లేరని, ఫలితంగా వారికి పవర్‌లూమ్స్ నడపడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. పవర్‌లూమ్స్‌కు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.101.77 కోట్ల సబ్సిడీ విడుదల కాకపోవడంతో, సిరిసిల్ల కో-ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లయి సొసైటీ (సెస్) తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురొంటున్నదని తెలిపారు. టీజీఎన్పీడీసీఎల్కు చెల్లించాల్సిన విద్యుత్తు కొనుగోలు ఖర్చులను కూడా చెల్లించలేకపోతున్నదని పేర్కొన్నారు. నేత కార్మికులను ఆదుకోవడానికి, వారి జీవనోపాధిని కాపాడటానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

