దిగులుపడొద్దమ్మా.. బాగా చదువుకో!
‘నాకు చదువుకోవాలని ఉన్నది. కానీ, పేదరికం నా అడుగులను కట్టడి చేస్తున్నది’ అంటూ ఓ నిరుపేద ఆదివాసీ విద్యార్థి ఎక్స్ వేదికగా చేసిన ఆవేదనా భరిత పోస్టుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘దిగులుపడొద్దమ్మా..నీ చదువు బాధ్యత నేను తీసుకుంటా.. ధైర్యంగా ముందుకెళ్లు’ అంటూ భరోసానిచ్చారు. చదువుకొనేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న శృతికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. పేదరికం విద్యాభ్యాసానికి అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో చేయూతనందించి పెద్ద మనుసు చాటుకున్నారు.
- నిరుపేద ఆదివాసీ బిడ్డకు కేటీఆర్ భరోసా
- శృతి చదువు కోసంరూ.50 వేల ఆర్థిక సాయం
- నగదు అందించిన బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు
హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) /ఏటూరునాగారం : ‘నాకు చదువుకోవాలని ఉన్నది. కానీ, పేదరికం నా అడుగులను కట్టడి చేస్తున్నది’ అంటూ ఓ నిరుపేద ఆదివాసీ విద్యార్థి ఎక్స్ వేదికగా చేసిన ఆవేదనా భరిత పోస్టుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘దిగులుపడొద్దమ్మా..నీ చదువు బాధ్యత నేను తీసుకుంటా.. ధైర్యంగా ముందుకెళ్లు’ అంటూ భరోసానిచ్చారు. చదువుకొనేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న శృతికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. పేదరికం విద్యాభ్యాసానికి అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో చేయూతనందించి పెద్ద మనుసు చాటుకున్నారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం వీరాపూర్‌కు చెందిన నిరుపేద ఆదివాసీ బిడ్డ పెనుక శృతి పట్టుదలతో రాత్రింబవళ్లు శ్రమించి కొడంగల్ అగ్రికల్చర్ కాలేజీలో ఏజీ బీఎస్సీ సీటు సాధించింది. కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబానికి శృతి చదువు ఖర్చులు భారంగా మారాయి. చదువు మానేయాల్సి వస్తుందేమోనని ఆమె తల్లడిల్లింది. స్థానికుల సూచన మేరకు ఇటీవల ‘నా చదువుకు సాయం చేయండి సార్’ అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్‌కు విజ్ఞప్తిచేసింది.
దీంతో చలించిపోయిన కేటీఆర్ వెంటనే స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు ఆదివారం శృతి కుటుంబాన్ని స్వయంగా కలిసి రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. అనంతరం తన ఫోన్‌ద్వారా శృతిని కేటీఆర్‌తో మాట్లాడించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ‘బాగా చదువుకో అమ్మా.. ధైర్యంగా ముందుకెళ్లు.. నీ చదువు బాధ్యత నాది’అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఉన్నత చదువు చదివి జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలనే శృతి ఆకాంక్షకు అండగా ఉంటానని అభయమిచ్చారు.
కేటీఆర్‌కు శృతి, తల్లిదండ్రుల ధన్యవాదాలు
తమ కుమార్తె చదువుకు ఆర్థిక సాయం చేసిన కేటీఆర్‌కు శృతి, వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. స్వయంగా తమ బిడ్డతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పడంపై ఎంతో సంతోషం వ్యక్తంచేశారు. ఆర్థిక సాయం అందించిన కేటీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నారు. కేటీఆర్ తనలాంటి బిడ్డలను ఎందరినో ఆదుకోవడం గొప్పవిషయమని కొనియాడారు. కార్యక్రమంలో ఏటూరునాగారం సర్పంచ్ కాకులమర్రి శ్రీలత, బీఆర్ఎస్ తాడ్వాయి మండలాధ్యక్షుడు దండుగుల సమ్మయ్య, నాయకులు కాకులమర్రి ప్రదీప్‌రావు, తాడూరి రఘు, ఎండీ ఖాజాపాషా, కర్ర రవీందర్, పులుసం పురుషోత్తం, రామాలయం చైర్మన్ దన్నపునేని కిరణ్, రఫీక్, కుమ్మరి చంద్రబాబు, తుమ్మ మల్లారెడ్డి, కూనూరు అశోక్, జాడి భోజారావు, కొండాయి చిన్ని, తాళ్లపల్లి మోహన్, బాస శరత్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

