సొసైటీల నిధులపై కాంగ్రెస్ కన్ను
సొసైటీల్లోని నిధులపై కాంగ్రెస్ పెద్దల కన్నుపడిందని, సహకార సంఘాల పాలకవర్గ నామినేటెడ్ పద్ధతిని న్యాయవ్యవస్థ ద్వారా అడ్డుకొని తీరుతామని సంఘాల చైర్మన్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.
- సహకార సంఘాల పాలకవర్గ నామినేటెడ్ పద్ధతిని అడ్డుకుంటాం
- సొసైటీ చైర్మన్లకు కేటీఆర్ హామీ
- పీఏసీఎస్‌లకు ఎన్నికలు పెట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి
- రైతులకు పంట రుణాలూ ఇవ్వలేని దుస్థితిలో సహకార బ్యాంకులు
- కేటీఆర్‌కు పీఏసీఎస్ అధ్యక్షుల వినతి
హైదరాబాద్/మేడ్చల్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): సొసైటీల్లోని నిధులపై కాంగ్రెస్ పెద్దల కన్నుపడిందని, సహకార సంఘాల పాలకవర్గ నామినేటెడ్ పద్ధతిని న్యాయవ్యవస్థ ద్వారా అడ్డుకొని తీరుతామని సంఘాల చైర్మన్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన సొసైటీ చైర్మన్లు తెలంగాణ భవన్లో శుక్రవారం కేటీఆర్‌ను కలిశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సహకార సంఘాలకు నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడం సరికాదని చెప్పారు.
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కృషి వల్లే సహకార సంఘాలు అభివృద్ధి చెందాయని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిన సమయంలో సహకార సంఘాల్లో రూ.13 వేల కోట్లు ఉంటే తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో 73 వేల కోట్ల నిధులకు చేరాయని తెలిపారు. సహకార సంఘాల సభ్యులు, రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 908 సొసైటీల్లో రూ.కోటి నుంచి రూ.50 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని, ఆ నిధులపై కాంగ్రెస్ పెద్దల కన్ను పడిందని ఆరోపించారు. రాష్ట్రంలోని సహకార సంఘాలు, సహకార బ్యాంకులకు వెంటనే ఎన్నికలు నిర్వహించేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కేటీఆర్‌ను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు కోరారు.
సహకార రంగం ఎదురొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. వారి విజ్ఞప్తిపై స్పందించిన కేటీఆర్ ఎన్నికల కోసం సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ల రాష్ట్ర ఫోరం నాయకులు కొండూరి రవీందర్రావు, నలిమెల అశోక్, మధుకర్, మురళి, పరమేశ్వర్‌రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, రాజుయాదవ్, మేడ్చల్ డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, టీఎస్టీవోబీ మాజీ చైర్మన్ రవీందర్రావు, సహకార సంఘాల జేఏసీ నేత అశోక్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

