Koppula Eshwar | ప్రజలకు కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలి : కొప్పుల ఈశ్వర్
Koppula Eshwar | న్నో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్(Congress) ప్రజలకు ఏం బాగు చేసిందో చెప్పాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) ఆ పార్టీ నాయ కులను నిలదీశారు.
కరీంనగర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 01 : ఎన్నో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్(Congress) ప్రజలకు ఏం బాగు చేసిందో చెప్పాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) ఆ పార్టీ నాయ కులను నిలదీశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా పూర్తిస్థాయిలో అమలు చేశారా? అని ప్రశ్నించారు. ఏ మొఖం పెట్టుకొని కేసీఆర్ ప్రజల్లోకి వస్తారు? అని ప్రశ్నిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. అసలు అధికారంలో ఉండి ఏ ఘనకార్యం చేశారని మంత్రులు, కాంగ్రెస్ నేతలు ప్రజల్లో తిరుగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆదివారం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి ఒక్కటైనా అమలు చేసిందా? అని ప్రశ్నించారు. రుణమాఫీ అని గొప్పులు చెప్పుకుంటున్న కాంగ్రెస్‌కు సిగ్గుండాలన్నారు. ఒక్క గ్రామంలోనైనా పూర్తి స్థాయిలో అమలు చేశారా? అని ప్రశ్నించారు. ఏ గ్రామానికైనా వచ్చి పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తారా? అని నిలదీశారు.
రైతులను కాంగ్రెస్ ఘోరంగా మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు, 17 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. నిరుద్యోగ భృతి, మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఎందుకు అమలు చేయడం లేదని కాంగ్రెస్ సర్కారును ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ మంత్రులు, నాయకులు జాగ్రత్తగా మాట్లాడాలని హితవుపలికారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజలు తరిమికోట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

