శివారుకు కోకాపేట భూమ్

- వేలం తర్వాత భూములకు భారీ డిమాండ్
- ఎకరా 3-4 కోట్లనుంచి 12 కోట్లకు జంప్
- రియాల్టీకి కలిసొస్తున్న రహదారుల కనెక్టివిటీ
- ట్రిపుల్ ఆర్తో వ్యవసాయ భూములకూ రెక్కలు
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ శివారు భూముల్లో కోకాపేట ‘భూమ్’ కొనసాగుతున్నది. ఇటీవల ప్రభుత్వ భూముల వేలం తర్వాత ఎకరా ధర పరుగులు తీస్తున్నది. ఈ-వేలంలో ఒక బిట్ ఏకంగా ఎకరా రూ.60 కోట్లకుపైగా.. సరాసరి ఎకరా రూ.45 కోట్లు పలికిన విషయం తెలిసిందే. దీంతో కోకాపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు మరింత పెరుగుతున్నాయి. నిన్నటిదాకా రూ.3 -4 కోట్లు ఉన్న ఎకరా రూ.12 నుంచి 13 కోట్ల వరకు పలుకుతున్నది. తెలంగాణ ఏర్పాటుకు ముందు కోటి రూపాయలలోపు ఉన్న ఎకరా ధర.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఒక్కసారిగా ఊపందుకున్నాయి. నగరశివారుకు అంతర్జాతీయ పెట్టుబడులు తరలిరావడం, ప్రభుత్వం రవాణారంగంలో తీసుకొచ్చిన మార్పులు, మౌలికవసతుల కల్పనతో భూముల ధరలు 10 నుంచి 12 రెట్లు పెరిగాయి. నిర్మాణ రంగంలో దేశంలోని మెట్రో నగరాల కంటే వేగంగా దూసుకుపోతున్న హైదరాబాద్.. రియల్రంగంలోనూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నది. కోకాపేట బూమ్ తర్వాత శివారుప్రాంత రైతుల్లో భరోసా మరింత పెరిగింది. ఈ ధరలను బెంచ్ మార్కుగా పెట్టుకొని భూముల ధరలను నిర్ధారించే అవగాహన సామాన్య రైతుల్లోనూ పెరగడమనేది విప్లవాత్మక మార్పుగా రియల్ ప్రముఖులు అభివర్ణిస్తున్నారు.
ప్రభుత్వ విధానాల ఫలితం
రాష్ట్రంలో సమర్థపాలన, అంతర్జాతీయంగా పెట్టుబడులను ఆకర్షించే చర్యలు, అభివృద్ధికి అనుగుణంగా మౌలికవసతులు హైదరాబాద్ శివారుల్లో భూములను బంగారుమయం చేస్తున్నాయి. గ్రామీణప్రాంతాల్లో పడావుపడిన భూములు పచ్చని మాగాణంగా మారితే.. రాజధాని శివారు ప్రాంతాల్లోని భూములు అంతర్జాతీయ మార్కెట్లలో హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. నేడు తెలంగాణలో ప్రతి ఒక్కరికీ భూమి విలువ తెలిసొచ్చింది. ఒకప్పుడు నగరం అంటే ఆబిడ్స్, కోఠి, సికింద్రాబాద్.. ఇలా సెంటర్ల ప్రాతిపదికన అభివృద్ధి జరిగేది. కానీ, కొన్నేండ్లుగా నానాటికీ విస్తరిస్తున్న నగరంలో అభివృద్ధి కేంద్రాలు మారిపోయాయి. ప్రధానంగా అంతర్జాతీయ ప్రాజెక్టులు, ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థలు కేంద్రంగా విస్తరిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు నలుమూలలా రవాణా అనుసంధానం (రోడ్ కనెక్టివిటీ) పెంచడం దీనికి మరింత ఊతమిస్తున్నది. ఇందులోభాగంగా గతంలో ఔటర్ రింగురోడ్డు ఆధారంగా జరిగిన అభివృద్ధి.. ఆపై ఇండస్ట్రియల్ పార్కులు, ఎలక్ట్రానిక్ సిటీలు, ఏరోస్పేస్ పార్కులు, రైల్వేకోచ్ ఫ్యాక్టరీలు, తదితర ప్రాజెక్టుల ఆధారంగా విస్తరించింది. ఇప్పుడు రీజనల్ రింగురోడ్డు (ట్రిపుల్ ఆర్) ప్రతిపాదనతో హైదరాబాద్ నలుదిక్కులా వ్యవసాయభూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KBR Park | ఎక్కడి స్తంభాలు అక్కడే.. పనులు ఆగిన కేబీఆర్ పార్క్ వద్ద అధ్వాన స్థితి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. దక్షి, షాలినిని కావాలనే ఎలిమినేట్ చేశారా?
GHMC | లంచాలు ఇచ్చినోళ్లకే పనులు.. ఇంజినీరింగ్ విభాగంలో అవినీతి ‘అక్రమార్కులు’
Hyderabad | మరోసారి భూముల వేలం.. రూ. 2 వేల కోట్ల సేకరణే లక్ష్యంగా HMDA పావులు
6 నెలల్లో 23 మరణశిక్షలు.. జడ్జి బదిలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

