క్యాంపస్ ప్లేస్మెంట్స్ల్లో కే ఎల్ వర్సిటీ రికార్డు
క్యాంపస్ ప్లేస్మెంట్స్ల్లో కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు మరోసారి రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ కంపెనీ నెక్స్ పర్ట్ కంపెనీలో విద్యార్థి సాత్విక్ రూ. 81 లక్షల వార్షిక ప్యాకేజీ సాధించాడు.
- రూ. 81 లక్షల వార్షిక ప్యాకేజీతో సంచలనం
హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : క్యాంపస్ ప్లేస్మెంట్స్ల్లో కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు మరోసారి రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ కంపెనీ నెక్స్ పర్ట్ కంపెనీలో విద్యార్థి సాత్విక్ రూ. 81 లక్షల వార్షిక ప్యాకేజీ సాధించాడు. వివిధ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు నిర్వహించిన ప్లేస్మెంట్స్ డ్రైవ్లో రూ.52 లక్షలు, రూ.44 లక్షలు, రూ.40 లక్షలు, రూ.34 లక్షల వార్షిక ప్యాకేజీలు సాధించినట్టు వర్సిటీ వీసీ డాక్టర్ పార్థసారథి వర్మ తెలిపారు.
150 మంది విద్యార్థులు రూ.25 లక్షలు, 630 మంది విద్యార్థులు రూ.15 లక్షల వార్షిక ప్యాకేజీలు దక్కించుకున్నారని పేర్కొన్నారు. ప్రముఖ కంపెనీలైన గూగుల్, హిటాచీ, తోషిబా, అమెజాన్, సర్వీస్ నౌ, జే పీ మోర్గాన్ వంటి 342 కంపెనీలు ఈ ఏడాది వర్సిటీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ డ్రైవ్ నిర్వహించగా, 6,300 మందికి పైగా ప్లేస్మెంట్స్ ఆఫర్స్ పొందారని, 4,750 మంది విద్యార్థులు ప్లేస్మెంట్స్ సాధించారని వెల్లడించారు. పదహారేండ్లుగా అర్హత గల విద్యార్థులందరికీ యూనిర్సిటీ 100% ప్లేస్మెంట్స్ అందించడం గర్వకారణంగా ఉందని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

