నిరుద్యోగులతో సర్కార్ చెలగాటం
నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడుతున్నదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి విమర్శించారు. శనివారం సరూర్‌నగర్‌లో జరుగనున్న యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు.
- ఇచ్చిన హామీలను గాలికొదిలింది
- ఉద్యోగాలు ఇవ్వకుండా వంచన
- కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు
- సరూర్‌నగర్ యువసంగ్రామ సదస్సును విజయవంతం చేయండి
- కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి
హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడుతున్నదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి విమర్శించారు. శనివారం సరూర్‌నగర్‌లో జరుగనున్న యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సదస్సుకు నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను గాలికొదిలిందని ధ్వజమెత్తారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను రెచ్చగొట్టి, అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిందని తెలిపారు.
‘తొలి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి, నేడు ఆ ఊసే ఎత్తడం లేదు. నిరుద్యోగులను నట్టేట ముంచడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లింది‘ అని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్‌రెడ్డి, పార్లమెంట్లో రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ ఉద్యోగాలు సంపాదించారని, రాష్ట్రంలోని సాధారణ నిరుద్యోగ యువతకు మాత్రం ఒక ఉద్యోగం కూడా దకకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు.
ఎన్నికల ముందు ప్రియాంకగాంధీని తీసుకొచ్చి నెలకు రూ.4 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని గుర్తుచేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ నోటిఫికేషన్ల నియామక పత్రాలను పంపిణీ చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఘనతగా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నదని ఆరోపించారు. సరూర్‌నగర్‌లో శనివారం జరుగనున్న యువ సంగ్రామ సదస్సుకు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

