కేసీఆర్ మరోసారి సీఎం కావాలి
కేసీఆర్ మరోసారి సీఎం కావాలని కోరుతూ ఆయన అభిమానులు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మాధుర గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకులు ఉదయ్ కిరణ్, నర్సింలు శనివారం దౌల్తాబాద్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి చేపట్టే పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
- దౌల్తాబాద్ టు ఎర్రవల్లికి అభిమానుల పాదయాత్ర
హత్నూర, నవంబర్ 7 : కేసీఆర్ మరోసారి సీఎం కావాలని కోరుతూ ఆయన అభిమానులు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మాధుర గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకులు ఉదయ్ కిరణ్, నర్సింలు శనివారం దౌల్తాబాద్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి చేపట్టే పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. వీరు 90 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టి ఆదివారం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకుంటారు.
మార్గమధ్యంలో చాకరిమెట్ల ఆంజనేయస్వామి సన్నిధానం,నాచారం లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో కేసీఆర్ పేరిట పూజలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్, నర్సింహులు మాట్లాడుతూ.. కేసీఆర్ సీఎంగా పనిచేసిన కాలంలో అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ తిరోగమనం దిశగా పనిచేయడం బాధిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, మాధుర సర్పంచ్ నవీన్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

