సీఎం కేసీఆర్‌కు సినారె రచనలంటే ఇష్టం

మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సినారె (సింగిరెడ్డి నారాయణరెడ్డి) రచనలు ఎంతో ఇష్టమని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. అందుకే సినారె అంత్యక్రియల్లో కేసీఆర్ స్వయంగా పాడెమోసి తన అభిమానాన్ని చాటుకున్నారని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో గురువారం ప్రముఖ కవి, సాహితీవేత్త సినారె 90వ జయంతి కార్యక్రమంలో సినారె చిత్రపటానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సినారె కవిగా, సినీగేయ రచయితగా పలు పక్రియల్లో తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారని పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్యాన్ని గంగా-జమునా తహజీబ్‌కు ప్రతీకగా నిలిపారన్నారు. ఎంపీగా, పలు యూనివర్సిటీలకు వైస్ చాన్స్‌లర్‌గా ఆయన విశేషసేవలు అందించారని కొనియాడారు. సినారె సారస్వత సదనం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, సినారె కుటుంబ సభ్యులు భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, గంధం రాములు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

