KCR Kit | కేసీఆర్ కిట్.. ‘మాతృవందన’కు డబుల్
మాతాశిశు మరణాల నివారణ కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘కేసీఆర్ కిట్' పథకం దేశానికే ఆదర్శంగా ఎందుకు నిలిచిందో తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
- పీఎంఎంవీవై కింద గర్భిణులకు సగటున రూ.3,890 సాయం
- కేసీఆర్ కిట్ ద్వారా సగటున అందుతున్నది రూ.9,079
- కేంద్రంతో పోల్చితే రాష్ట్ర సాయం 133 శాతం ఎక్కువ
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): మాతాశిశు మరణాల నివారణ కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘కేసీఆర్ కిట్’ పథకం దేశానికే ఆదర్శంగా ఎందుకు నిలిచిందో తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘ప్రధాన మంత్రి మాతృవందన యోజన’ (పీఎంఎంవీవై) పథకం కన్నా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్ రెట్టింపు స్థాయిలో ప్రయోజనకారిగా ఉన్నదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలన తొమ్మిదేండ్లు పూర్తయిన సందర్భంగా ఆరోగ్య రంగంలో సాధించిన అభివృద్ధిని వివరిస్తూ గురువారం ప్రధాని మోదీ ఓ ట్వీట్ చేశారు. పీఎంఎంవీవై పథకం కింద దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3.11 కోట్ల మంది గర్భిణులు సాయం పొందినట్టు పేర్కొన్నారు. వీరికి కేంద్రం ద్వారా రూ.12,100 కోట్ల ప్రయోజనం కలిగినట్టు వెల్లడించారు. ఈ లెక్కన సగటున ఒక్కో గర్భిణికి అందించిన సాయం రూ.3,890. ఈ పథకం ఫలితంగా దవాఖాన ప్రసవాలు 94.8 శాతానికి పెరిగినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
కేసీఆర్ కిట్‌తో 13.90 లక్షల మందికి లబ్ధి
రాష్ట్రంలో కేసీఆర్ కిట్ ద్వారా ఇప్పటివరకు 13.90 లక్షల మంది గర్భిణులు ప్రయోజనం పొందారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1261 కోట్ల ఆర్థిక సాయం అందించింది. కేసీఆర్ కిట్ ద్వారా సగటున ఒక్కో గర్భిణికి రూ.9,079 సాయం అందింది. కేంద్రం సాయంతో పోల్చితే రాష్ట్ర ప్రభుత్వం రూ.5,189 అధికంగా సాయం అందించింది. ఇది కేంద్రం సాయం కన్నా 133 శాతం అధికం.
ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు
రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకం కింద ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, బాబు పుడితే రూ.12 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నది. రిజిస్ట్రేషన్ సమయంలో, ఏఎన్సీ చెకప్స్ తర్వాత, ప్రభుత్వ దవాఖానలో ప్రసవం, పిల్లలకు టీకాలు వేయించిన తర్వాత.. ఇలా విడతలవారీగా నగదు జమ అవుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
Loksabha Elections | ఢిల్లీని పట్టినోడే బాద్షా.. జాతీయ పార్టీలతో కలబడితేనే తెలంగాణ నిలబడేది!
Horoscope | 28-11-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
చంపేయండి.. బెయిల్ ఇప్పిస్తా!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

