హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పేర్కొన్నారు. బీబీ, త్రిపుల్ ఆర్, పుష్ప, కేజీఎఫ్ 2 తరహాలోనే టీఆర్ఎస్ కూడా పాన్ ఇండియాలో బీఆర్ఎస్గా విజయవంతం అవుతుందని ఆయన మంగళవారం ట్విట్టర్లో పోస్టు పెట్టారు.
యష్, ప్రభాస్, తారక్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ రీల్ ఫిల్మ్స్టార్లని, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం రియల్ పాన్ఇండియా పొలిటికల్ స్టార్ అంటూ కేసీఆర్‌కు వర్మ కితాబు ఇచ్చారు.