ఇదిగో కేసీఆర్ ముందుచూపు.. కరువులోనూ నీళ్లు పారేలా ప్రణాళిక
‘కాళేశ్వరం ఎందుకు? లక్ష కోట్లు ముంచిండ్రు, పనికిరాని ప్రాజెక్టు, రివర్స్ పంపింగ్ ఎందుకు? అనవసరంగా నాశనం చేసిండ్రు? వాటితోటి పైసా లాభం లేదు’ అని కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మూడేండ్లుగా నిత్యం చెప్పే సోదీ అందరికీ తెలిసిందే.
జగిత్యాల, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : ‘కాళేశ్వరం ఎందుకు? లక్ష కోట్లు ముంచిండ్రు, పనికిరాని ప్రాజెక్టు, రివర్స్ పంపింగ్ ఎందుకు? అనవసరంగా నాశనం చేసిండ్రు? వాటితోటి పైసా లాభం లేదు’ అని కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మూడేండ్లుగా నిత్యం చెప్పే సోదీ అందరికీ తెలిసిందే. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ఎందుకు? వరద కాలువ నుంచి కాకతీయ కెనాల్‌కు లింక్ కాలువలు ఎందుకు? ఆ పథకాల వల్ల, పనుల వల్ల ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఎట్లా లాభం అవుతుందన్నది ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది. 122 కిలోమీటర్ల పొడవునా ఒక్క తూము లేకుండా, నిశ్చలంగా, నిలబడిపోయిన వరద కాలువకు మాజీ సీఎం కేసీఆర్..
ఎక్కడికక్కడ తూములు ఏర్పాటు చేసి, వరద కాలువ నుంచి కాకతీయ కాలువకు లింక్ కెనాల్‌ను అనుసంధానం చేయడంతో కరువు కోరలు చాచుతున్న వేళ కాకతీయ ఆయకట్టు చివరి రైతుల పొలాలకు సైతం నీళ్లు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. జగిత్యాలతోపాటు కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లోని 24 డిస్ట్రిబ్యూటరీల పరిధిలోని ఆయకట్టు రైతుల పొలాలకు ఈ నీటిని అందించే పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ ముందు చూపుతో ఇంత కరువు కాలంలో, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత అతి తక్కువ ఉన్నప్పటికీ చివరి ఆయకట్టు భూములకు నీరందుతుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

