పులులకు కారిడార్‌గా కాగజ్‌నగర్ ఫారెస్ట్
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అడవులు పులుల ఆవాసానికి కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. 2012లో కవ్వాల్ టైగర్ జోన్ ఏర్పాటు కాగా.. అటవీ అధికారులు పులుల సంరక్షణకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి.
- సురక్షిత ప్రాంతంగా కవ్వాల్ టైగర్ జోన్
- పెరుగుతున్న పులుల సంఖ్య
- స్థిర నివాసాల కోసం సంచారం
కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అడవులు పులుల ఆవాసానికి కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. 2012లో కవ్వాల్ టైగర్ జోన్ ఏర్పాటు కాగా.. అటవీ అధికారులు పులుల సంరక్షణకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఇక్కడి అడవులు పులులకు అనుకూలంగా ఉండటంతో తడోబా, తిప్పేశ్వర్ నుంచి వచ్చి స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ ఏడెనిమిదేండ్లలో వాటి సంఖ్య పెరిగిం ది. 2015లో కదంబ అడవుల్లో ఓ ఆడపులి నాలుగు పిల్లలకు జన్మనిచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. రెండో ఈతలో మరో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది.
యుక్త వయసు (18 నెలలు)కు వచ్చే పులు లు తల్లి నుంచి వేరుపడి స్వతంత్రగా జీవిస్తుంటాయి. ఈ పులులు ఆవాసం కోసం మంచిర్యాల కవ్వాల్‌తోపాటు తడోబా, ఇంద్రావతి అభయారణ్యాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలోని తడోబా, ఇంద్రావతి, అభయారణ్యాలను కారిడార్‌గా ఏర్పాటు చేసుకొని స్వేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. జిల్లాలో 14 పులులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పెంచికల్పేట్ అడవుల్లో నాలుగు పులులు (రెండు జంటలు) స్థిర నివాసం ఏర్పాటు చేసుకోగా, మిగతావి ఆవాసం కోసం అడవుల్లో సంచరిస్తున్నట్టు భావిస్తున్నారు. అటవీ అధికారులు ట్రాకర్ల ద్వారా వాటి కదలికలను గమనిస్తూ, పులుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. దట్టమైన అడవులకు తోడు నీటి వనరులు, వన్యప్రాణులు అధికంగా ఉండటంతో ఇక్కడికి వచ్చేందుకు పులులు ఆసక్తి చూపుతున్నాయి.
స్థిరనివాసం కోసం సంచారం
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అడవులతోపాటు మంచిర్యాల జిల్లా అడవుల్లో పులులు సంచరిస్తున్నాయి. బెజ్జూర్, పెంచికల్పేట్, పెద్దవాగు, ప్రాణహిత, దహెగాం, కర్జీ, బెల్లంపల్లి, వేమనపల్లి, చెన్నూర్ అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు పులులు శారీరకంగా కలుసుకునే సమయం కావడంతో మగపులులు ఆడ తోడు కోసం అడవుల్లో విస్తృతంగా సంచరిస్తుంటాయి. ప్రస్తుతం కాగజ్‌నగర్ కారిడార్‌లో పులుల సంచారం ఎక్కువగా ఉన్నది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లోని ప్రాణహిత, ఇంద్రావతి నదులను దాటుకొని పులులు రాకపోకలు సాగిస్తున్నాయి. జిల్లాలో పులులు అధికంగా సంచరించే ప్రాంతాలపై దృష్టిసారించిన అధికారులు వాటి సంరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు.
రైతును హతమార్చిన పులి
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం చౌపన్‌గూడ పంచాయతీ పరిధిలోని ఖానాపూర్‌కు చెందిన ఆదివాసీ రైతు సిడాం భీము (69) పులిదాడిలో మృతి చెందాడు. మంగళవారం ఉదయం రైతు భీము కుటుంబ సభ్యులతో కలిసి పత్తి ఏరేందుకు ధర్మగుట్ట ప్రాంతంలోని తన చేనుకు వెళ్లాడు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులు భోజనం చేస్తుండగా, భీము ఒక్కడే పత్తి ఏరుతున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా పులి ఆయనపై దాడి చేసి కొండ ప్రాంతం నుంచి దిగువకు ఈడ్చుకెళ్తుండగా, పక్క చేనులో ఉన్న రైతు గమనించి కేకలు వేశాడు. కొంతదూరంలో పోడుభూములు సర్వే చేస్తున్న అధికారులు, రైతులు పరిగెత్తుకొచ్చి కేకలు వేయడంతో భీముని వదిలి అడవిలోకి పారిపోయింది. అప్పటికే అతడు చనిపోయాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

