Naga Chaitanya | ‘వృషకర్మ’ రిలీజ్ వేళ నాగచైతన్య సాహస యాత్ర.. పెద్దపల్లి రామగిరి కోటపై ట్రెక్కింగ్ చేస్తూ ఆసక్తికర ముచ్చట్లు!
Naga Chaitanya | అక్కినేని హీరో నాగచైతన్య ప్రధాన పాత్రలో, దర్శకుడు కార్తిక్ వర్మ దండు రూపొందించిన తాజా యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘వృషకర్మ’.
Naga Chaitanya | అక్కినేని హీరో నాగచైతన్య ప్రధాన పాత్రలో, దర్శకుడు కార్తిక్ వర్మ దండు రూపొందించిన తాజా యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘వృషకర్మ’. భారీ అంచనాల నడుమ ఈ సినిమా డిసెంబరు 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. చిత్ర విడుదల తేదీ సమీపిస్తున్న తరుణంలో ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసిన నాగచైతన్య, సినిమా నేపథ్యానికి తగ్గట్టుగానే ఓ సాహసోపేతమైన ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ యూట్యూబర్ జాస్తితో కలిసి ఆయన చారిత్రక పెద్దపల్లి రామగిరి కోట పైకి అడ్వెంచర్ ట్రెక్కింగ్ చేశారు.
ఈ సాహస యాత్రకు సంబంధించిన పూర్తి వీడియోను చిత్ర బృందం తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ప్రకృతి ఒడిలో, ఎత్తైన కొండలపై సాగిన ఈ ప్రయాణంలో నాగచైతన్య ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ట్రెక్కింగ్ చేస్తూనే యూట్యూబర్ జాస్తితో తన సినీ ప్రయాణం, కుటుంబ విశేషాలు మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర సంగతులను పంచుకున్నారు. ఈ సందర్భంగా కెరీర్లో ఎదురయ్యే ఒడిదుడుకుల గురించి మాట్లాడుతూ, తాను విజయాన్ని గానీ, అపజయాన్ని గానీ ఎప్పుడూ అతిగా సీరియస్‌గా తీసుకోనని, రెండింటినీ సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగుతానని చైతన్య స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ట్రెక్కింగ్ వీడియో సోషల్ మీడియాలో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటూ వైరల్ అవుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Naga Chaitanya | ‘వృషకర్మ’ రిలీజ్ వేళ నాగచైతన్య సాహస యాత్ర.. పెద్దపల్లి రామగిరి కోటపై ట్రెక్కింగ్ చేస్తూ ఆసక్తికర ముచ్చట్లు!
KTR | నియోజకవర్గాల పునర్విభజనపై మా వైఖరి ఎప్పుడైనా స్పష్టమే : కేటీఆర్
Mayawati | ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి: మాయావతి
GLP-1 Medicine | జీఎల్పీ-1 మందులను వాడడం ఆపేస్తే ఏం జరుగుతుంది..? ఎలాంటి పరిణామాలు ఉంటాయి..?
BRS Bahrain | బహ్రెయిన్‌లో ఘనంగా దీక్షాదివస్..కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం : సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

