రాహుల్ జీ.. అప్పుడు మీరెక్కడ?
తెలంగాణ హక్కుల కోసం టీఆర్ఎస్ పోరాడుతుంటే ఎక్కడికి పోయారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నించారు.
- తెలంగాణ కోసం పార్లమెంట్లో ఎన్ని సార్లు మాట్లాడారు?
- రాష్ట్ర హక్కులపై టీఆర్ఎస్ పోరాడితే మీరు ఎక్కడున్నారు?
- కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్నలు
హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హక్కుల కోసం టీఆర్ఎస్ పోరాడుతుంటే ఎక్కడికి పోయారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నించారు. రాహుల్ పర్యటన సందర్భంగా ట్విట్టర్లో.. ‘రాహుల్‌గాంధీ జీ.. మీరు కానీ, మీ పార్టీ కానీ ఎన్ని సార్లు పార్లమెంట్లో తెలంగాణ అంశాలను, హక్కులను ప్రస్తావించారో చెప్పండి. రాష్ట్ర హక్కుల కోసం టీఆర్ఎస్ పోరాడుతుంటే మీరెక్కడున్నారు? దేశవ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై టీఆర్ఎస్ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడికి పోయారు? తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన జాతీయ హోదా, తెలంగాణ రాష్ర్టానికి హక్కుగా రావాల్సిన పెండింగ్ జీఎస్టీ బకాయిలు, నిధుల గురించి టీఆర్ఎస్ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడున్నారు? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యాసంస్థలు ఇవ్వకుండా మొండిచేయి చూపిస్తున్నప్పుడు మీరు ఎక్కడున్నారు?’ అని కవిత నిలదీశారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, ఆసరా పథకాలపై ఆరాతీసి, అవి తెలంగాణ ముఖచిత్రాన్ని ఎలా మార్చాయో, దేశానికి సమగ్ర అభివృద్ధి మార్గాన్ని ఎలా చూపించాయో.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అడిగి తెలుసుకోవాలని హితవు చెప్పారు. ‘సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను 11 రాష్ర్టాలు అమలు చేస్తున్నాయి. వాటి గురించి నేర్చుకొని, అర్థం చేసుకొనేందుకు మీకు తెలంగాణలోకి స్వాగతం చెప్తున్నాం’ అని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

