హైదరాబాద్, జూన్ 7(నమస్తే తెలంగాణ) : మలేషియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన కేటీఆర్‌ను బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆస్ట్రేలియాలో పార్టీ కార్యక్రమాలపై నాగేందర్‌రెడ్డిని అభినందించారు. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు వస్తానని ఆయనకు హామీ ఇచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకులు ఉప్పు సాయిరామ్, రాజేశ్, గిరి రాపోలు ఉన్నారు.