Home
Telangana
Kandika Adarsh Is Providing Legal Advice Across The Country To Increase The Value Of Black Court Says Ktr
ఆదర్శ్ సేవలు అభినందనీయం.. న్యాయ సలహాలతో నల్లకోటు విలువ పెంచిండు.. కేటీఆర్
కందిక ఆదర్శ్ అనే వ్యక్తి దేశవ్యాప్తంగా న్యాయ సలహాలు అందిస్తూ నల్లకోటు విలువ పెంచుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు.
- రూపాయికే న్యాయ సలహా గొప్పవిషయం
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : కందిక ఆదర్శ్ అనే వ్యక్తి దేశవ్యాప్తంగా న్యాయ సలహాలు అందిస్తూ నల్లకోటు విలువ పెంచుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. ఆదర్శ్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మంగళవారం ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. న్యాయం కోసం పడిగాపులు కాస్తున్న వారికి టీహబ్ సహకారంతో అండగా నిలిచారని తెలిపారు. సీఎల్ఎన్ఎస్ అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా రూపాయికే న్యాయ సలహాలు అందిస్తున్నారని కొనియాడారు.
‘సామాన్యుడి సమస్యలు తీర్చినప్పుడే టెక్నాలజీకి సార్థకత అని కేసీఆర్ మాకెప్పుడూ చెప్తుంటారు.. తెలంగాణ యువతలో సృజనాత్మకతను వెలికితీసి, వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే సదాశయంతో టీహబ్, వీహబ్, టీవర్స్ వంటి సంస్థలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకొల్పింది’ అని గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

