Telangana Minister Gangula | యాదవుల అభివృద్ధికి కాల్వ నర్సయ్య యాదవ్ కృషి.. రాష్ట్ర మంత్రి గంగుల పిలుపు
Telangana Minister Gangula | యాదవుల అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి కాల్వ నర్సయ్య యాదవ్ అని, ఆయన ఆశయాలను నెరవేర్చాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
Telangana Minister Gangula | యాదవుల అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి కాల్వ నర్సయ్య యాదవ్ అని, ఆయన ఆశయాలను నెరవేర్చాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన యాదవ సంఘం నాయకులు దివంగత కాల్వ నర్సయ్య యాదవ్ విగ్రహాన్ని మంత్రి గంగుల ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ మాట ఇస్తే తప్పని కులం యాదవ కులం అని చెప్పారు. పేదల సంక్షేమం కోసం చివరి వరకు పని చేసిన వ్యక్తి నర్సయ్య యాదవ్ అని కొనియాడారు. బొమ్మకల్ గ్రామంలో యాదవ సంఘానికి గతంలోనే స్థలం కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటికే రూ.15 లక్షలు కేటాయించడం జరిగిందని, వాటితో పాటు మరో 10 లక్షలు అదనంగా కేటాయిస్తున్నట్లు తెలిపారు.
రెండు రోజుల్లో అభివృద్ధి పనులు ప్రారంభం అవుతాయని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. యాదవుల ఆరాధ్య దైవం శ్రీ కృష్ణుడి దేవస్థానం నిర్మాణం ఇస్కాన్ ఆధ్వర్యంలో కరీంనగర్లో రూ.20 కోట్లతో నిర్మించనున్నామని చెప్పారు. ఇందుకోసం మూడెకరాల భూమికి ఇప్పటికే కేటాయించామని అన్నారు. సమైక్య పాలనలో కులవృత్తుల పట్ల వివక్ష చూపి కులవృత్తులను ధ్వంసం చేశారని, కానీ స్వయంపాలన లో కుల వృత్తులను కాపాడే దిశగా సీఎం కేసీఆర్ చేయూత అందిస్తున్నారని అన్నారు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

