కేయూలో ఊడిపడిన స్లాబ్ పెచ్చులు
వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ పోతన గర్ల్స్ హాస్టల్ స్లాబ్ పెచ్చులు భారీగా కుప్పకూలి పడ్డాయి. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగిన సమయంలో ఆ గదిలో విద్యార్థినులు లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
- విద్యార్థినులకు తప్పిన ప్రమాదం
- పోతన గర్ల్స్ హాస్టల్లో ఘటన
హనుమకొండ చౌరస్తా, జూలై 13 : వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ పోతన గర్ల్స్ హాస్టల్ స్లాబ్ పెచ్చులు భారీగా కుప్పకూలి పడ్డాయి. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగిన సమయంలో ఆ గదిలో విద్యార్థినులు లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనను నిరసిస్తూ విద్యార్థినులు శనివారం పోతన హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పెరటి మల్లారెడ్డి అక్కడికి చేరుకుని విద్యార్థినులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. పెచ్చులూడిన సమయానికి తాము లేకపోవడం ప్రాణాలతో బయటపడ్డామని లేకుంటే ఘోరం జరిగేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకదశలో మల్లారెడ్డిని బంధించేందుకు యత్నించారు. కేయూలో వర్షాకాలంలో తమ బాధలు పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. కొద్దిరోజుల క్రితమే సీలింగ్ ఫ్యాన్ కిందపడటంతో ఓ విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. వరుస ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది. తమ ప్రాణాలకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులని విద్యార్థినులు ప్రశ్నిస్తున్నారు.
పెద్ద ప్రమాదం తప్పింది
మెస్‌కు వెళ్లి వస్తుంటే పాము, కుక్కలు కనిపించాయి. వాటి గురించే మాట్లాడుకుంటూ గదికి వచ్చాం. అదే భయంతో ఉండగా పక్కనున్న టేబుల్‌పై మా స్నేహితులు కూర్చున్నారు. నేను పక్క బెడ్‌పై పడుకుని ఫోన్ చూస్తుంటే పెద్ద బండ పడటంతో వెంటనే లేచి ఫ్యాన్ ఆఫ్ చేశా. అప్పుడే ఒకటి తర్వాత పెద్ద పెచ్చులూడి బెడ్‌పై పడ్డాయి. ఆ బెడ్‌పై పడుకునే అమ్మాయి ఉదయమే వాళ్ల ఇంటికి వెళ్లింది. లేకుంటే ఆమె ప్రాణానికే ప్రమాదం జరిగేది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదు.
-అనూష, విద్యార్థిని
హాస్టల్‌ను షిఫ్ట్చేసే ఆలోచనలో ఉన్నాం..
పోతన హాస్టల్ నుంచి విద్యార్థులను షిఫ్ట్చేసే ఆలోచనలో ఉండగానే ప్రమాదవశాత్తు పెచ్చులూడిపడ్డాయి. ప్రత్యామ్నాయంగా విద్యార్థులను మరో హాస్టల్‌కు తరలిస్తాం. కొన్ని సంవత్సరాలుగా హాస్టల్ విద్యార్థుల సంఖ్య పెరిగింది. గతంలో పద్మాక్షి హాస్టల్ ఒక్కటే ఉండేది. బాయ్స్ హాస్టల్ అమ్మాయిలకు కేటాయించాం. పది రోజుల క్రితం ఫ్యాన్ కిందపడి రెక్కతగలడంతో విద్యార్థినికి గాయమైంది. ప్రభుత్వం నుంచి నిధులు వస్తే యూనివర్సిటీని అభివృద్ధి చేస్తాం.
– ప్రొఫెసర్ పెరటి మల్లారెడ్డి, రిజిస్ట్రార్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

