పోలీసుల సొమ్ము కొట్టేశాడు.. చార్మినార్ జోన్లో జూనియర్ అసిస్టెంట్ స్కామ్
కార్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసులకు సంబంధించిన పలు రకాల ఖర్చులు, ఇతర పనుల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. ఈ నిధులను కార్యాలయ అధికారిక ఖాతాలో జమ చేస్తారు. పోలీస్ వెల్ఫేర్‌తోపాటు, అత్యవసరాలకు వినియోగించేలా కొన్ని కోట్ల నిధులు ఖాతాలో ఉంటాయి. వీటిపై కారుణ్య నియామకాల్లో వచ్చిన ఓ జూనియర్ అసిస్టెంట్ కన్నుపడింది.
- కార్ అధికారిక ఖాతా నుంచి రూ.3 కోట్లు విత్‌డ్రా
- ఐదురోజులుగా విచారిస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు
- కేసు పెట్టకుండానే డబ్బులు కట్టించేందుకు ప్రయత్నం
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : దొంగలను వేటాడి పట్టుకునే పోలీసులను ఓ జూనియర్ అసిస్టెంట్ బోల్తా కొట్టించాడు. ఏకంగా సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (కార్) హెడ్‌క్వార్టర్స్‌లోనే కోట్లు కొట్టేశాడు. పోలీసుల ఖర్చుల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన సొమ్మును జేబులో వేసుకున్నాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.3 కోట్లు విత్‌డ్రా చేసుకున్నట్టు తేలింది. జోన్ ప్రధాన అధికారి కార్యాలయంలో సీసీగా పనిచేసిన సమయంలోనూ ఉన్నతాధికారుల పేర్లు చెప్పి, అందినకాడికి దోచుకున్నాడట. ఈ కుంభకోణం తాజాగా బయటపడటంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. బయటికి తెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో సొమ్ము రికవరీ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
క్యాంపు క్లర్క్‌గా పనిచేస్తూ..
కార్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసులకు సంబంధించిన పలు రకాల ఖర్చులు, ఇతర పనుల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. ఈ నిధులను కార్యాలయ అధికారిక ఖాతాలో జమ చేస్తారు. పోలీస్ వెల్ఫేర్‌తోపాటు, అత్యవసరాలకు వినియోగించేలా కొన్ని కోట్ల నిధులు ఖాతాలో ఉంటాయి. వీటిపై కారుణ్య నియామకాల్లో వచ్చిన ఓ జూనియర్ అసిస్టెంట్ కన్నుపడింది. డబ్బులు కొట్టేసేందుకు తనకున్న పోలీస్ పరిచయాలను వాడుకొని ప్లాన్ వేశాడు. నిల్వ ఉన్న నిధులకు వచ్చే డబ్బులను ఒకటిరెండుసార్లు తీస్తే పెద్దగా ఎవరూ గుర్తుపట్టరని సీనియర్లు సలహా ఇచ్చారట. దీంతో మొదట్లో చిన్నగా మొదలుపెట్టి, ఆ తర్వాత పై అధికారుల సహకారంతో, వారి సంతకాలతోనే తరచూ డబ్బులు డ్రా చేసినట్టు తేలింది. కార్ ఖాతాలో నుంచి డబ్బులు మాయమవడంపై అధికారులు ఆరా తీయగా సదరు క్లర్క్ బాగోతం బయటపడింది. లెక్కలన్నీ తీయగా వడ్డీ డబ్బులే సుమారు రూ.3 కోట్లకుపైగా క్లర్క్ కొట్టేసినట్టు గుర్తించారట. సదరు ఉద్యోగి కార్ హెడ్‌క్వార్టర్స్ నుంచి సౌత్ జోన్ డీసీపీ కార్యాలయంలో సీసీగా పనిచేశాడు. వచ్చినప్పటి నుంచే చేతివాటం ప్రదర్శించాడని చెప్తున్నారు. అప్పట్లో కార్యాలయ ప్రధాన అధికారి ఇంట్లో ఒక ఫంక్షన్ కోసం జోన్ పరిధిలోని పోలీస్స్టేషన్ల నుంచి రూ.15 లక్షలు వసూలు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. అంతేకాదు జోన్ ఉన్నతాధికారులను కలవాలంటే ఆ ఉద్యోగికి తగినంత ముట్టజెప్పాల్సి వచ్చేదని, లేదంటే చాలా కష్టమయ్యేదని పోలీసులే చెప్పుకొంటున్నారు. ఏండ్ల తరబడి ఆ సీటులో కూర్చొని, పోలీసులపైనే అజమాయిషీ చేసేవాడని అంటున్నారు. పై అధికారులతో చెప్పించుకొని సెటిల్మెంట్లు కూడా చేశాడని, భారీగా సంపాదించాడని చర్చ జరుగుతున్నది.
ఉన్నతాధికారులకు తెలిసే?
ఉన్నతాధికారుల సూచన మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. చార్మినార్ జోన్లో కాకుండా గోల్కొండజోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అప్పగించారని, పురానీహవేలిలోని కార్యాలయంలో ఐదురోజులుగా ప్రశ్నిస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

