హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : జవహర్ నవోదయ విద్యాలయ (జేఎన్వీ) ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
దేశవ్యాప్తంగా 649 జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరు, తొమ్మిదో తరగతుల ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను నవోదయ విద్యాలయ సమితి తాజాగా విడుదల చేసింది.