TS governor | తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణం స్వీకారం చేసిన సీపీ రాధాకృష్ణన్
TS governor | తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాధాకృష్ణన్‌కు కేంద్రం తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. దాంతో ఇవాళ ఆయన ప్రమాణస్వీకారం చేశారు.
TS governor : తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాధాకృష్ణన్‌కు కేంద్రం తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. దాంతో ఇవాళ ఆయన ప్రమాణస్వీకారం చేశారు.
తెలంగాణతోపాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా రాధాకృష్ణన్ అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న తమిళిసై రాజీనామా చేయడంతో ఆ రెండు పదవులు ఖాళీ అయ్యాయి. తమిళనాడు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడే ఉద్దేశంతో తమిళిసై గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ పదవులను వదులుకున్నారు. దాంతో జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్‌కు కేంద్రం అదనపు బాధ్యతలు కట్టబెట్టింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

