కన్నెపల్లికి పోదామా!
దృష్టి మళ్లించేందుకే సీఎం చెత్త మాటలు.. ప్రజలకు భరోసా కావాలి.. బూతులు కాదు.. కేసీఆర్‌ను తిడితే ప్రజలకు ఒరిగేదేం లేదు.
- కరువు సన్నద్ధతలో రేవంత్ సర్కార్ విఫలం
- కాంగ్రెస్ వద్దన్న యాదాద్రే నేడు దిక్కైంది
- బొగ్గులేని చోట కట్టారని మూర్ఖపు మాటలు
- కన్నెపల్లి నుంచి నీళ్లెత్తకనే సాగు సంక్షోభం
- మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపాటు
ఎల్ నినోతో కరువు వస్తుందని తొమ్మిది నెలల ముందు నుంచే హెచ్చరికలు చేస్తున్నా కాంగ్రెస్ సర్కార్ మొద్దునిద్రపోయింది. ఇటలీ లాంటి దేశాలు కరువులో ఎలాంటి పంటలు వేయాలో రైతులను అప్రమత్తం చేసినయ్.. తెలంగాణలో మాత్రం దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగిన చందంగా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. కరువు సన్నద్ధత చర్యలు చేపట్టడంలో ఘోరంగా విఫలమై దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ పాలనపై నెపం నెడుతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు కావాల్సింది బూతులు కాదు..భరోసా!
-మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
ఉత్తమ్‌కుమార్‌రెడ్డీ.. ఇద్దరం కలిసి కన్నెపల్లి పంప్‌హౌస్‌కు పోదాం..నేను చెప్పిన పద్ధతిలో పంపులు ఆన్ చేస్తే నీళ్లు ఎందుకు రావో చూస్తా.. యాదాద్రి ప్లాంట్ దగ్గర కేసీఆర్‌ను.. నన్ను కట్టేయాలంటవా రేవంత్‌రెడ్డీ? నువ్వు నేనూ ఒకే కారులో కొడంగల్‌కు పోదామా? నీ ఊరు కొండారెడ్డిపల్లికి పోదామా? ప్రజలు ఎవరిని కట్టేస్తారో చూద్దామా?
హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తేతెలంగాణ): ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన కరువు పాపం కాంగ్రెస్ సర్కార్‌దేనని బీఆర్ఎస్ మాజీ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకొని, ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం రేవంత్‌రెడ్డి చెత్త మాటలు మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, పార్టీ నేత నర్సింహారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎల్ నినోతో కరువు వస్తుందని తొమ్మిది నెలల ముందు నుంచే తెలిసినా ఈ సర్కార్ పట్టించుకోలేదని మండిపడ్డారు. ‘ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి.. ఇటలీ లాంటి దేశాల్లో కరువు పరిస్థితుల్లో ఎలాంటి పంటలు వేయాలో ఆ దేశాల పాలకులు రైతులను అప్రమత్తం చేశారు.. కానీ తెలంగాణలో మాత్రం దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా రేవంత్ ప్రభుత్వ వ్యవహారం ఉన్నది’ అని విమర్శలు గుప్పించారు. కరువు సన్నద్ధత చర్యలు చేపట్టడంలో ఘో రంగా విఫలమైన సర్కార్.. కేసీఆర్ పాలనపై నెపంనెట్టి తప్పించుకొనేందుకు యత్నిస్తున్నదని మండిపడ్డారు.
గద్దెనెక్కి దాదాపు మూ డేండ్లవుతున్నా కేసీఆర్‌పై అభాండాలు వేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు కావాల్సింది బూతులు కాదు.. భరో సా అని దెప్పిపొడిచారు. కేసీఆర్, బీఆర్ఎస్ను దూషించడం ద్వారా ప్రజాసమస్యలు పరిష్కారం కావనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తమ మాటలు విని ప్రజలు నవ్వుకుంటారనే సోయిలేకుండా మంత్రులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని తూర్పారబట్టారు. కరోనా కాలంలో రెప్పపాటు కూడా పోకుండా కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని గుర్తుచేశారు. నాడు నిర్మించిన విద్యుత్తు వ్యవస్థను రేవంత్ సర్కార్ సర్వనాశనం చేస్తున్నదని ఆరోపించారు.
విజయవాడలో థర్మల్ ప్లాంట్ ఎందుకు కట్టారు?
బొగ్గులేనిచోట యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని కట్టారని సీఎం రేవంత్ చేసిన ఆరోపణలపై జగదీశ్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ‘రేవంత్‌రెడ్డి.. నువ్వు బాస్‌లుగా చెప్పుకుంటు న్న వారు సింగరేణికి 530 కిలోమీటర్ల దూరంలోని కడపలో ఆర్టీపీపీ, మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి 1,200 కిలోమీటర్ల దూరంలోని విజయవాడలో ఎందుకు కట్టారు? డీఆర్డీవో, డీఆర్డీఏలను హైదరాబాద్‌లో ఎందుకు కట్టారు? ఢిల్లీలోనే కడితే సరిపోయేది కదా? వారికి తెలివిలేదని అనుకుంటున్నావా? నువ్వు బుద్ధిలేక మాట్లాడుతున్నావా?’ అంటూ తనదైన శైలిలో ప్రశ్నాస్త్రాలు సంధించారు.
బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న వ్యక్తి నోటికొచ్చినట్టు మాట్లాడటం దుర్మార్గమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందాలని, అన్ని ప్రాంతాలవారికీ సమా న అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతో ప్రాజెక్టులు నిర్మిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు. కేసీఆర్ సైతం దూరదృష్టితోనే యాదాద్రి పవర్‌ప్లాంట్‌ను నిర్మించారని చెప్పారు. యాదాద్రి నుంచి సింగరేణి దూరంగా ఉన్నందున బొగ్గు రవాణాలో సమస్యలు వస్తున్నాయంటున్న రేవంత్‌రెడ్డి.. సింగరేణి దగ్గరే ఉన్న కొత్తగూడెం, భద్రాద్రి పవర్ ప్లాంట్లలో పూర్తిస్థాయిలో ఎందుకు కరెంట్ ఉత్పత్తి చేయడం లేదని నిలదీశారు.
ఉత్తమ్‌రెడ్డి.. ఉత్తర కుమారుడే
కాళేశ్వరం కుంగిపోవడానికి కేసీఆర్ చేసిన అవినీతే కారణమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన ఉత్తమ్‌రెడ్డి కాదని తన సొంత జిల్లా నల్లగొండ, అత్తగారి జిల్లా మహబూబ్‌నగర్‌ను ఎండబెట్టిన ఉత్తరకుమారుడని చురకలంటించారు. సీఎం మందలించడంతో నిద్రలేచిన ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘ఉత్తమ్రెడ్డీ.. మనిద్దరం కన్నెపల్లి పంప్‌హౌస్‌కు వెళ్దాం. నేను చెప్పిన పద్ధతిలో పంపులు ఆన్ చేస్తే నీళ్లు ఎందుకు రావో నేను చూస్తా’ అని సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కన్నెపల్లికి వెళ్లి ఇప్పుడు కూడా నీళ్లు ఎత్తిపోయవచ్చని ప్రజలకు వివరించారని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి తన సొంత జిల్లా మహబూబ్‌నగర్ ప్రజలను పణంగా పెట్టి తన గురువైన చంద్రబాబుకు 700 కిలోమీటర్ల దూరంలోని కుప్పంకు కృష్ణా జలాలను తరలించే అవకాశం ఇచ్చారని ఆరోపించారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కలిసి తెలంగాణ జల హక్కులను ఏపీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. నీళ్లందించడం కాంగ్రెస్ వాళ్లకు చేతగాకుంటే తప్పుకోవాలని డిమాండ్ చేశారు. కరువుకాలంలోనూ నీరందించే బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మేము బాధ్యతలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
రేవంత్‌రెడ్డీ.. రైతుల వద్దకు వెళ్దామా?
యాదాద్రి ప్లాంట్ దగ్గర కేసీఆర్‌ను, జగదీశ్‌రెడ్డిని కట్టేయాలని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగదీశ్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘రేవంత్‌రెడ్డీ.. నువ్వూ నేనూ ఒకే కారులో కొడంగల్‌కు వెళ్దామా? నీ ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్దామా? ప్రజలు ఎవరిని కట్టేస్తారో చూద్దామా? అని చాలెంజ్ చేశారు. దమ్ముంటే స్వీకరించాలని డిమాండ్ చేశారు. అయినా కాంగ్రెస్ నేతలు మూటలు పంచుకోవడంపై ఉన్న ధ్యాస ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కోవడంపై లేదని దెప్పిపొడిచారు.
తమ్మిడిహట్టిపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు గతంలో మూడుచోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా ఒప్పందం కుదరలేదని, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దామని ముక్తసరిగా సమాధానమిచ్చారు. సింగరేణితో కోల్ అగ్రిమెంట్ లేకుండానే వైటీపీఎస్ నిర్మించారనే ప్రశ్నకు.. ప్లాంట్ ఎక్కడ నిర్మించినా బొగ్గు కేటాయించేది కేంద్రమేనని స్పష్టంచేశారు. ఇంగితజ్ఞానం లేని కాంగ్రెస్ నేతలు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలన్న కేంద్రం నిర్ణయాన్ని కేసీఆర్ ఆనాడే వ్యతిరేకించారని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి తన చీకటి దోస్తుల ప్రయోజనాల కోసమే విదేశీ బొగ్గుపై ఆసక్తి చూపుతున్నారని ఆరోపించారు. కరెంట్ కష్టాలకు కారకుడైన రేవంత్‌రెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దమ్ముంటే యాదాద్రిని బంద్ పెట్టండి..
దమ్ముంటే కేసీఆర్ నిర్మించిన యాదాద్రి పవర్ ప్లాంట్‌ను బంద్పెట్టాలని మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు సవాల్ విసిరారు. ప్రస్తుత కరెంట్ సంక్షోభంలో యాదాద్రి ప్లాంటే తెలంగాణ ప్రజలకు దిక్కయిందని గుర్తుచేశారు. కేసీఆర్‌పై కక్షతో కాళేశ్వరం నుంచి నీళ్లు తరలించకుండా చోద్యం చూస్తున్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నదని ధ్వజమెత్తారు.
కరెంట్ ధరలపై పచ్చి అబద్ధాలు
మార్కెట్లోని కరెంట్ ధరలపై సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నారని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. యూనిట్‌కు సమయాన్ని బట్టి రూ.1.80 నుంచి రూ.6.70కు దొరుకుతుందని తెలిపారు. ఇది తాను చెప్తున్నది కాదని, ఐఈఎక్స్ ఇండెక్సే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కానీ రూ.15 వెచ్చించినా కరెంట్ దొరుకడం లేదని రేవంత్‌రెడ్డి నిర్లజ్జగా అసత్యాలు చెప్తున్నారని విరుచుకుపడ్డారు. ‘కేసీఆర్ కమీషన్ల కోసమే ఎక్కువ ధరకు కొన్నారని ఆరోపణలు చేసిన వారు.. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని, కమీషన్ల కోసమే ఇప్పుడు ఎక్కువ ధరకు కొంటారా? అని సూటిగా ప్రశ్నించారు.
కరెంట్ కొనుగోలు చేసే తెలివిలేక దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ‘కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత కనీసం ఒక్క కిలోవాట్ కూడా విద్యుదుత్పత్తి జరగలేదు.. నాడు కేసీఆర్ నిర్మించిన యాదాద్రి థర్మల్ ప్లాంటే ఇప్పుడు దిక్కయింది’ అని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని గుంజకు కట్టేయాలని, తనను కోదండం ఎక్కించాలని చిల్లరగా మాట్లాడటం దుర్మార్గమని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, కాంగ్రెస్సోళ్లనే కోదండం ఎక్కించేందుకు సమయం కోసం ఎదురు చూస్తున్నారని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

