IT Raids | హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్.. పిస్తా హౌస్, షాగౌస్ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇండ్లలో సోదాలు
హైదరాబాద్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దాడులు (IT Raids) నిర్వహిస్తున్నది. నగరంలోని ప్రముఖ హోటళ్లయిన పిస్తా హౌస్, షాగౌస్ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్లల నివాసాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దాడులు (IT Raids) నిర్వహిస్తున్నది. నగరంలోని ప్రముఖ హోటళ్లయిన పిస్తా హౌస్, షాగౌస్ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల నివాసాలు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు పత్రాలు పరిశీలిస్తున్నారు. ఏకకాలంలో 15 చోట్ల మొత్తం 50కిపైగా బృందాలతో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న అన్ని బ్రాంచీలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మెహిఫిల్ రెస్టారెంట్ ఓనర్ ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
కాగా, పిస్తా హౌస్, షాగౌస్ హోటళ్లు ఏటా వందల కోట్ల వ్యాపారం నిర్వహిస్తున్నాయి. దేశంలోని వివిధ నగరాలతోపాటు దుబాయ్‌లోనూ రెండు హోటళ్ల బ్రాంచీలు ఉన్నాయి. నిర్వహిస్తున్న వ్యాపారానికి, ఏటా సమర్పిస్తున్న ఐటీ రిటర్న్స్‌లో తేడాలు ఉండటంతో దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
రాజేంద్రనగర్‌లోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్, మహమ్మద్ ముస్తాన్ ఇండ్లల్లో సోదాలు చేస్తున్నారు. అదేవిధంగా శాలిబండలోని పిస్తా హౌస్ ప్రధాన బ్రాంచ్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
రికార్డుల్లో చూపిన ఆదాయం, నిజమైన ఆదాయం మధ్య వ్యత్యాసం, ట్యాక్స్ చెల్లింపులో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. హవాలా, నకిలీ లావాదేవీలు, అనుమానాస్పద ట్రాన్సాక్షన్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పిస్తా హౌస్‌కి హైదరాబాద్‌లో 44 బ్రాంచీలు ఉండగా, మెహిఫిల్ రెస్టారెంట్‌కి 15 బ్రాంచీలు ఉన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

