హైదరాబాద్, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ): టీజీ జెన్కోకు అంతర్జాతీ య గుర్తింపు లభించింది. సంస్థ ప్రతిష్ఠాత్మక ISO 9001:2015 (క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్) సర్టిఫికేషన్ సాధించింది. ఈ మేరకు సర్టిఫికేషన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార చేతులమీదుగా ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్‌మిట్టల్ ఆ ధ్వర్యంలో మంగళవారం సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హరీశ్ అందుకున్నారు.
ఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఐ ఎస్వో ప్రతినిధి శివయ్య పాల్గొన్నారు.