పన్ను పీకాలా? వద్దా?
కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా ఉంది పదో ఆంధ్ర మహాసభలో పన్నుల తీర్మానం. జయసూర్య అధ్యక్షతన జరిగిన ఈ మహాసభల్లో వ్యాపారులు, సంపన్నులపై పన్నులు విధించాలని సూచిస్తూ నిజాంను కోరాలని కమ్యూనిస్టులు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మాదిరాజు రామకోటేశ్వరరావు వ్యతిరేకించారు.
కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా ఉంది పదో ఆంధ్ర మహాసభలో పన్నుల తీర్మానం. జయసూర్య అధ్యక్షతన జరిగిన ఈ మహాసభల్లో వ్యాపారులు, సంపన్నులపై పన్నులు విధించాలని సూచిస్తూ నిజాంను కోరాలని కమ్యూనిస్టులు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మాదిరాజు రామకోటేశ్వరరావు వ్యతిరేకించారు. నిజామాంధ్రలో పెద్ద ధనవంతులు లేరని, ఆదాయాలు కూడా అంతగా లేవని కారణాలు చూపారు. అధికారుల వేధింపులు పెరుగుతాయని హెచ్చరించారు.
వ్యాపారులపై పన్నులు వేస్తే, వాళ్లు వినియోగదారులపైనే వేస్తారని మిరియాల నారాయణ గుప్త అన్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు చర్చ వాడివేడిగా సాగింది. అనంతరం సభలో ఓటింగ్ నిర్వహించారు. 17 ఓట్ల తేడాతో ఈ తీర్మానం వీగిపోయింది. ఇక ఎవరిళ్లకు వాళ్లు పోతుంటే వ్యాపారులు, సంపన్నులపై పన్నును వ్యతిరేకించిన నేతల తీరుని నిరసిస్తూ.. ‘వ్యాపారులకు, షావుకారులకు కమ్యూనిస్టులు అమ్ముడుపోయారు’ అంటూ నినాదాలు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

