హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలకానున్నాయి. ఉదయం 11 : 30 గంటలకు ఈ ఫలితాలను ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు.
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే, జూన్ మాసాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాల కోసం https://tgbie.cgg.gov. in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.