Foxconn | 9 ఏండ్ల కష్టం.. కేసీఆర్ కృషితో రాష్ర్టానికి ఫాక్స్‌కాన్.. ఆగస్టులో ఉత్పత్తి ప్రారంభం
నీళ్లు, నిధులు, నియామకాల పేరిట సాధించుకొన్న తెలంగాణ యువతకు భారీఎత్తున ఉద్యోగాలు కల్పించాలని 2014 నుంచే కేసీఆర్, కేటీఆర్ సంకల్పించారు.
- లక్ష మందికి ఉపాధి దక్కే చాన్స్.. దేశ చరిత్రలో ఇదే తొలిసారి
- తెలంగాణకు కంపెనీని రప్పించడానికి 2015 నుంచే శ్రమ
- మహారాష్ట్రకు తరలించాలన్న కేంద్రం కుట్రలకు కేటీఆర్ చెక్
- తైవాన్‌కు మూడుసార్లు వెళ్లిన అప్పటి ప్రజాప్రతినిధులు
- నిరుడు కేసీఆర్‌తో సంస్థ చైర్మన్ యంగ్లీయూ సమావేశం
- కిందటి మే నెలలో కేటీఆర్ చేతులమీదుగా శంకుస్థాపన
- నేడు ఉత్పత్తులకు సిద్ధం.. తొలి దశలో 25 వేల కొలువులు
Foxconn | హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ)/(స్పెషల్ టాస్క్ బ్యూరో): నీళ్లు, నిధులు, నియామకాల పేరిట సాధించుకొన్న తెలంగాణ యువతకు భారీఎత్తున ఉద్యోగాలు కల్పించాలని 2014 నుంచే కేసీఆర్, కేటీఆర్ సంకల్పించారు. అలా తొమ్మిదేండ్ల కిందట వీళ్లు నాటిన ఓ మొక్క నేడు మహావృక్షమై ఫలాలు అందించేందుకు సిద్ధమైంది. యువతకు ఉద్యోగాలు కల్పించాలనే గత ప్రభుత్వ లక్ష్యం మరికొద్ది రోజుల్లో సాకారం కానున్నది. తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజం, యాపిల్ ఐఫోన్లను తయారు చేస్తున్న ఫాక్స్‌కాన్ సంస్థ వచ్చే ఆగస్టు నుంచి కొంగరకలాన్ ప్లాంటు ద్వారా ఉత్పత్తులు ప్రారంభించనున్నది. ఈ ప్లాంట్‌తో మొదటి దశ లో 25,000 మందికి ఉద్యోగావకాశాలతో ప్రారంభమై మొత్తంగా లక్ష మందికి పైగా ఉపాధి లభించే అవకాశం ఉన్నది. స్వతంత్ర భారత దేశ చరిత్రలోనే ఇది రికార్డు. అయితే, ఈ కంపెనీ అంత ఆషామాషీ గా ఏమీ తెలంగాణకు రాలేదు. రాత్రికి రాత్రే జరిగిన అద్భుతమేమీ కాదు. దీని వెనుక తెలంగాణ తొలి ము ఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి పరిశ్రమల మంత్రి కేటీఆర్ తొమ్మిదేండ్ల కృషి ఉన్నది. అప్పటి బీఆర్ఎస్ ప్ర భుత్వం తీసుకొచ్చిన పారదర్శక విధానాలు, టీఎస్ఐపాస్ వంటి విప్లవాత్మక మార్పులతోనే ఇది సాధ్యమైంది.
తరలించుకుపోయే కుట్రలు
అది 2015 సంవత్సరం. తెలంగాణ యువతకు పెద్దసంఖ్యలో ఉద్యోగాలు కల్పించాలని కేసీఆర్, కేటీఆర్ నిర్ణయించారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజం ఫాక్స్‌కాన్ గురించి తెలుసుకొని.. ఏదేమైనా ఆ కంపెనీ ప్లాంట్‌ను రాష్ర్టానికి రప్పించాలనుకొన్నారు. అనుకొన్నదే తడవుగా 2015 జనవరి 11న తొలిసారి ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రతినిధులతో కేటీఆర్ భేటీ అయ్యారు. కంపెనీ స్థాపనకు తెలంగాణ సర్కారు ఇస్తున్న ప్రాధాన్యతను, హైదరాబాద్‌లో ఉన్న ప్రత్యేకతలను వివరించారు. అదే ఏడాది ఫాక్స్‌కాన్ ప్రతినిధులు హైదరాబాద్‌కు వచ్చేలా చేశారు. ఇది పసిగట్టిన కేంద్రంలోని కొందరు పెద్దలు కంపెనీని మహారాష్ట్రకు తరలించుకుపోయే కుట్రకు తెరతీశారు. ఇది గమనించిన కేసీఆర్, కేటీఆర్ కంపెనీ అత్యున్నత ఉద్యోగులతో వీడియో సమావేశాలు నిర్వహించారు. కంపెనీ ప్రధాన కార్యాలయం ఉన్న తైవాన్‌కు అప్పటి రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక ప్రతినిధులు మూడు సార్లు వెళ్లొచ్చారు. కంపెనీ ప్రతినిధులతో పదుల సంఖ్యలో కేటీఆర్ చర్చలు జరిపారు. టీఎస్ఐపాస్, రాష్ట్రంలోని స్నేహపూర్వక వాతావరణం, మానవ వనరులు, రవాణా సదుపాయాలు ఇలా అన్నింటినీ లోతుగా వివరించారు. దీంతో తెలంగాణలోనే పెట్టుబడి పెట్టేందుకు ఫాక్స్‌కాన్ సుముఖత వ్యక్తం చేసింది. అలా నిరుడు మార్చిలో అప్పటి సీఎం కేసీఆర్‌తో సమావేశమైన అనంతరం సంస్థ చైర్మన్ యంగ్ లియు తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటును ఫైనల్ చేశారు. కంపెనీ ప్రతినిధులు కోరిన విధంగానే వెనువెంటనే అప్పటి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో 196 ఎకరాల భూమి కేటాయించగా, మేలో అప్పటి పరిశ్రమల మంత్రి కేటీఆర్ సంస్థకు శంకుస్థాపన చేశారు. వచ్చే ఆగస్టులో ఫాక్స్‌కాన్ ఉత్పత్తులు ప్రారంభం కానున్నాయి.
ఐఫోన్‌కు 70 శాతం ఉత్పత్తుల సరఫరా
హోన్ హై టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్‌కాన్) ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యాపిల్ ఐఫోన్‌కు సుమారు 70 శాతం ఉత్పత్తులను సరఫరా చేస్తున్నది ఈ కంపెనీనే. ఫోన్లతోపాటు ఐపాడ్లు, వైర్లెస్ ఇయర్ఫోన్లు, చార్జర్లు తదితర వాటిని కూడా తయారు చేస్తున్నది.
ఫాక్స్‌కాన్ కస్టమర్లు
యాపిల్, గూగుల్, జియోమీ, అమెజాన్, హ్యూలెట్ ప్యాకర్డ్, హ్యూవాయ్, సిస్కో, నెన్టెండో, సెగా అలీబాబా గ్రూప్, డెల్, ఫేస్బుక్, సోనీ, మైక్రోసాఫ్ట్, నోకియా తదితర దిగ్గజ కంపెనీలు.ఫాక్స్‌కాన్ కార్యకలాపాలు ఏయే దేశాల్లో చైనా, వియత్నాం, థాయిలాండ్, మలేషియా, అమెరికా, యూరప్, భారత్ సహా 24 దేశాల్లో ఫాక్స్‌కాన్ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తున్నది.
ఫాక్స్‌కాన్‌తో మనకేంటి?
తొలి దఫాలో తెలంగాణలో పెట్టుబడి 4,595 కోట్లు
తొలి దఫాలో తెలంగాణ యువతకు ఉద్యోగాలు 25000
మొత్తంగా తెలంగాణ యువతకు రానున్న ఉద్యోగాలు: లక్షకు పైనే
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

