ఇండిగో విమానంలో అగ్నిప్రమాదం
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విమానం గాల్లో ఉండగా జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
- పేలిన పవర్‌బ్యాంక్ .. హైదరాబాద్‌లో ల్యాండింగ్
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విమానం గాల్లో ఉండగా జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఢిల్లీ నుంచి ఇండిగో విమానం (6E6115) చెన్నై బయల్దేరింది. లగేజీ కంపార్ట్ మెంట్లోని ఓ ప్రయాణికుడి పవర్‌బ్యాంక్ పేలడంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి.
దీన్ని గమనించిన క్యాబిన్ సిబ్బంది తక్షణమే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ముందు జాగ్రత్తచర్యగా పైలట్ విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నట్టు ఇండిగో సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

