Komuravelli | కొమురవెల్లి మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్.. కొత్తగా స్టేషన్ ఏర్పాటు చేయనున్న రైల్వేశాఖ..!
Komuravelli | కొమురవెల్లి మల్లన్న భక్తుల కల నెరవేరబోతోంది. మనోహరాబాద్-కొత్తపల్లి మార్గంలో మార్గంలో కొత్తగా కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ నిర్మించనున్నది. దీంతో రైలు ఆగేందుకు మార్గం సుగమమైంది.
Komuravelli | కొమురవెల్లి మల్లన్న భక్తుల కల నెరవేరబోతోంది. మనోహరాబాద్-కొత్తపల్లి మార్గంలో మార్గంలో కొత్తగా కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ నిర్మించనున్నది. దీంతో రైలు ఆగేందుకు మార్గం సుగమమైంది. భక్తుల విజ్ఞప్తి మేరకు సాధ్యాసాధ్యాలపై చర్చించిన రైల్వేశాఖ.. కొమురవెల్లి మల్లన్న జాతర సందర్భంగా.. రైల్వేహాల్ట్ స్టేషన్ నిర్మాణానికి అంగీకారం తెలిపింది. లకుడారం, దుద్దెడ స్టేషన్ల మధ్య కొమురవెల్లిలో కొత్త హాల్ట్ స్టేషన్ నిర్మాణానికి రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైల్వే అధికారుల నిర్ణయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
జాతర ప్రారంభానికి ముందుగా కొమురవెల్లి మల్లన్న భక్తులకు మోదీ ప్రభుత్వం అందించిన కానుక, ఈ రైల్వేస్టేషన్ అన్నారు. మల్లన్న భక్తులకు రైల్వేమార్గం త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తున్నామని.. రైల్వేస్టేషన్ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా భక్తుల తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలిపారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో మొదలై.. ఉగాది వరకు మల్లన్న జాతర వైభవంగా సాగుతుంది. ఈ జాతరకు లక్షలాదిమంది భక్తులు తరలివస్తుంటారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

