205 కోట్లతో పెల్లెట్ ప్లాంట్
పొట్టు, ప్లాస్టిక్ వ్యర్థాలతో పెల్లెట్లు తయారుచేసే అంతర్జాతీయ సంస్థ ఇన్క్రెడిబుల్ హస్క్ ఇంటర్నేషనల్ గ్రూప్ రాష్ట్రంలో దాదాపు రూ.205 (25మిలియన్ డాలర్లు) కోట్ల పెట్టుబడితో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది.
- రాష్ట్రంలో ఇన్క్రెడిబుల్ హస్క్ పెట్టుబడి
- పొట్టు, ప్లాస్టిక్ వ్యర్థాలతో పెల్లెట్ల తయారీ
- ఏటా వెయ్యి టన్నుల ఉత్పత్తి సామర్థ్యం
- కేటీఆర్‌తో సంస్థ ప్రతినిధుల సమావేశం
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): పొట్టు, ప్లాస్టిక్ వ్యర్థాలతో పెల్లెట్లు తయారుచేసే అంతర్జాతీయ సంస్థ ఇన్క్రెడిబుల్ హస్క్ ఇంటర్నేషనల్ గ్రూప్ రాష్ట్రంలో దాదాపు రూ.205 (25మిలియన్ డాలర్లు) కోట్ల పెట్టుబడితో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. ఇందులో ఏటా వెయ్యి టన్నుల బయో పెల్లెట్లు తయారు చేయనున్నారు. ఇన్క్రెడిబుల్ హస్క్ గ్రూప్ యూకే సీఈవో కీత్ రిడ్జ్‌వే, ఆ సంస్థ భారత విభాగం సీఈవో సీకా చంద్రశేఖర్ నేతృత్వంలోని ప్రతినిధిబృందం ఆదివారం లండన్‌లో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావుతో సమావేశమైంది.
ఈ సందర్భంగా వారు తెలంగాణలో పెల్లెట్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేసేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. సహకార విధానం ద్వారా పొట్టు, పునర్వినియోగ ప్లాస్టిక్ సేకరణ కోసం తగిన రోడ్‌మ్యాప్ రూపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నట్టు తెలిపారు. పెల్లెట్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, పెట్టుబడుల విభాగం ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, ముఖ్య సంబంధాల అధికారి అమర్నాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సరుకు రవాణా ఓడలు, విమానాలు, గోదాముల్లో సరుకు నిల్వ చేసేందుకు ఈ పెల్లెట్లు ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడతాయి. వీటిపై కంటెయినర్లు, సరుకు బాక్సులను ఉంచుతారు. దీనివల్ల సరుకును తేలిగ్గా ఎత్తడం, దింపడానికి వీలు కలుగుతుంది. సరుకు తడిసిపోకుండా పెల్లెట్లు కాపాడుతాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

