అక్రమంగా ‘ఫార్మా’ రైతుల అరెస్ట్
కోర్టు స్టే ఆర్డర్ ఉన్న భూముల్లో పనులు ఎలా చేపడతారంటూ ప్రశ్నించిన రైతులను పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
- పరిహారం ఇవ్వకుండానే పనులు చేపట్టిన అధికారులు
- కోర్టు స్టే ఉండగా ఎలా చేస్తారంటూ అడ్డుకొన్న రైతులు
- అరెస్ట్‌లను ఖండించిన ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ
యాచారం, మే 20 (నమస్తే తెలంగాణ): కోర్టు స్టే ఆర్డర్ ఉన్న భూముల్లో పనులు ఎలా చేపడతారంటూ ప్రశ్నించిన రైతులను పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిద్ద గ్రామానికి చెందిన పంతం సత్తమ్మకు చెందిన సర్వే నంబర్ 311లోని పొలం నుంచి ఫ్యూచర్‌సిటీ రోడు ్డకోసం బుధవారం అధికారులు పోలీస్ పహారాలో పనులు చేపట్టారు.
కోర్టు స్టే ఉండగా పనులు చేయొద్దని, పైగా అసైన్డ్ భూమికిగాను సత్తమ్మ పొలానికి సగం నష్టపరిహారంతోపాటు ప్లాట్లు ఇవ్వలేదని, పొలంలో ఎలాంటి పనులు చేయొద్దని కుటుంబీకులు అధికారులను కోరారు. అయినప్పటికీ పోలీసుల సహకారంతో అధికారులు, సిబ్బంది పొలంలో ఉన్న పశువులకొట్టాన్ని కూల్చేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే బోర్లు, పశుగ్రాసం ధ్వంసం చేశారు. పశువుల కొట్టంలో ఆవులు, లేగదూడలు ఉం డడంతో దాన్ని కూల్చకుండా రైతు కుటుంబసభ్యులు అడ్డుకొన్నారు.
దీంతో రైతులు పంతం మధు, పంతం మణికంట, పంతం జంగయ్య, పంతం అలివేలును పోలీసులు అరెస్ట్ చేసి గ్రీన్ ఫార్మాసిటీ స్టేషన్‌కు తరలించారు. రైతుల అరెస్ట్‌ను ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ తీవ్రంగా ఖండించింది. కమిటీ సమన్వయకర్త కవుల సరస్వతి మాట్లాడుతూ.. రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడమే ప్రజాపాలనా? అంటూ ప్రశ్నించారు. స్టే ఆర్డర్ ఉండగా పనులు ఎలా నిర్వహిస్తారని మండిపడ్డారు. ఆర్డీవో అనంతరెడ్డి, ఏసీపీ రాజు, సీఐ సత్యనారాయణ కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రైతులకు ఇస్తామని చెప్పిన ఫార్మా ప్లాట్లను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

