రెచ్చిపోయిన ఇసుకాసురులు
ఇసుకాసురులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి వేళ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులపై దాడికి దిగారు. తమనే ఆపుతారా? అంటూ రాళ్లు, కర్రలతో తల పగులగొట్టారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బెజ్జోరాలో శుక్రవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటుచేసుకున్నది.
- అర్ధరాత్రి వేళ అక్రమంగా తరలింపు
- అడ్డుకున్న బీఆర్ఎస్ నేత తల పగులగొట్టిన మాఫియా
- భీమ్‌గల్ మండలం బెజ్జోరాలో ఘటన
భీమ్‌గల్, జూలై 20: ఇసుకాసురులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి వేళ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులపై దాడికి దిగారు. తమనే ఆపుతారా? అంటూ రాళ్లు, కర్రలతో తల పగులగొట్టారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బెజ్జోరాలో శుక్రవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటుచేసుకున్నది. బెజ్జోరా శివారులోని కప్పలవాగు నుంచి కొన్నాళ్లుగా అర్ధరాత్రి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అధికార పార్టీ కనుసన్నల్లో ఈ తతంగం సాగుతున్నది. దీనిపై గతంలోనే కలెక్టర్, సీపీకి ఫిర్యాదు చేసినా పెద్దగా స్పందన లేదు. శుక్రవారం అర్ధరాత్రి ముచ్కూర్ నుంచి భీమ్‌గల్ వైపు వస్తున్న బీఆర్ఎస్ యూత్ నేతలు కర్నే మహేందర్, అనిల్, నరేశ్‌కు ఇసుక ట్రాక్టర్లు ఎదురుపడ్డాయి.
వీరు వాటిని అడ్డుకోగా, మద్దూరి భాస్కర్, శ్రీరాం రవి, రాజుతోపాలు పలువురు అక్కడికి చేరుకున్నారు. అర్ధరాత్రి వేళ ఇసుకను ఎక్కడికి తరలిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించగా.. ‘అడ్డుకోవడానికి మీరెవరు?’ అని అడగడంతో కొద్దిసేపు వాగ్వా దం జరిగింది. వెంటనే బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు సమాచారమిచ్చారు. భాస్కర్ అనే వ్యక్తి పెద్ద కట్టె తీసుకుని దాడికి యత్నించగా, కర్నే మహేందర్ ప్రతిఘటించారు. ఈ క్రమంలో కిందపడిపోయిన భాస్కర్ పక్కనే ఉన్న రాయితో దాడి చేయడంతో మహేందర్ తలకు తీవ్రగాయమైంది. సహచరులు హుటాహుటిన భీమ్‌గల్‌లోని ప్రైవేట్ దవాఖానకు తరలించి, చికిత్స చేయించారు. బాధితుడు మహేందర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై హరిబాబు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఓటరు నమోదులో వేగం పెంచాలి… రేవంత్ రెడ్డిని గద్దె దించాలి’
‘పిల్లలపై లైంగిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
Harish Rao | చంద్రబాబు నాయుడు ఏపీకి కరువు లేకుండా చేశారు.. తెలంగాణకు కరువు తెచ్చిందే కాంగ్రెస్ : హరీశ్ రావు
‘భూసార పరిరక్షణతోనే అధిక దిగుబడులు’
‘ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

