వనపర్తిలో బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టు
చిన్నారిపై లైంగిక దాడిని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై వనపర్తి టౌన్ పోలీసులు అక్రమ కేసులు నమోదుచేసి అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చిన్నారిపై జరిగిన లైంగికదాడిపై ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులు నందిమళ్ల అశోక్, మెకానిక్ శ్రీను, చీర్ల చందర్‌తోపాటు మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేయడం వివాదాస్పదమైంది.
- భగ్గుమన్న రాజకీయ, ప్రజా సంఘాల నేతలు
- టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట భారీ ఎత్తున ఆందోళన
- నేతలను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : చిన్నారిపై లైంగిక దాడిని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై వనపర్తి టౌన్ పోలీసులు అక్రమ కేసులు నమోదుచేసి అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చిన్నారిపై జరిగిన లైంగికదాడిపై ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులు నందిమళ్ల అశోక్, మెకానిక్ శ్రీను, చీర్ల చందర్‌తోపాటు మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేయడం వివాదాస్పదమైంది. నాయకుల అరెస్ట్‌ను ఖండిస్తూ బీఆర్ఎస్, బీజేపీ, ప్రజాసంఘాల నేతలు టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఆందోళనకు దిగారు. లైంగికదాడి నిందితులపై దృష్టిసారించకుండా సంబంధం లేని వారిపై ఎమ్మెల్యే అక్రమ కేసు నమోదు చేయించారని ఆరోపించారు.
అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాధిత చిన్నారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన నాయకులను అనవసరంగా ఇబ్బందులు పెడ్తున్నారని, వారిని వదిలిపెట్టాలని పోలీసులతో వాగ్వాదానికి దిగా రు. పోలీసులు బీఆర్ఎస్ నాయకులను కోర్టుకు తరలించగా.. న్యాయమూర్తి వారికి బెయిల్ మంజూరు చేశారు. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులతోపాటు పలువురిని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పరామర్శించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టి నా భయపడేది లేదని, వారికి తనతోపాటు పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

