IFS Officers | హైదరాబాద్ : తెలంగాణలో పలువురు ఐఎఫ్ఎస్ అధికారులకు పదోన్నతులు, బదిలీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్, చీఫ్ లైఫ్ వార్డెన్‌గా లోకేశ్ జైశ్వాల్, హరితహారం పీసీసీఎఫ్‌గా సువర్ణ, అటవీ ఉత్పత్తుల చీఫ్ కన్జర్వేటర్‌గా రామలింగం, జూపార్కుల సంచాలకులుగా వీఎస్ఎన్వీ ప్రసాద్ నియామకం అయ్యారు. భద్రాద్రి డీఎఫ్‌వో లక్ష్మణ్ రంజిత్ నాయక్ అటవీ అభివృద్ధి సంస్థకు బదిలీ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం డీఎఫ్‌వోగా కిష్ట గౌడ్ నియామకం అయ్యారు.