EAMCET | ట్యూషన్ ఫీజు కట్టలేదో.. మీ సీటు కోల్పోయినట్లే.. స్పష్టం చేసిన ఎంసెట్ అధికారులు
EAMCET | మీకు ఎంసెట్‌లో సీటు వచ్చిందా.. అయితే మీరు ట్యూషన్ ఫీజు చెల్లించకపోతే.. వచ్చిన సీటు కోల్పోయినట్టే. ఒకవేళ సీటు అవసరం లేదనుకొంటే ఫీజు కట్టకపోయినా పర్వాలేదు. దాంతో ఆ సీటును రద్దు చేసి, రెండో విడత కౌన్సెలింగ్‌లో ఇతరులకు కేటాయిస్తారు.
EAMCET | హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : మీకు ఎంసెట్‌లో సీటు వచ్చిందా.. అయితే మీరు ట్యూషన్ ఫీజు చెల్లించకపోతే.. వచ్చిన సీటు కోల్పోయినట్టే. ఒకవేళ సీటు అవసరం లేదనుకొంటే ఫీజు కట్టకపోయినా పర్వాలేదు. దాంతో ఆ సీటును రద్దు చేసి, రెండో విడత కౌన్సెలింగ్‌లో ఇతరులకు కేటాయిస్తారు. ఎంసెట్ ఇంజినీరింగ్ మొదటి విడత సీట్లను ఆదివారం కేటాయించిన విషయం తెలిసిందే. సీటు పొందిన వారు ట్యూషన్ ఫీజును ఈ నెల 22 లోపు చెల్లించే అవకాశం కల్పించారు. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ కోటా విద్యార్థుల్లో జీరో ఫీజుగా ఉన్నవారు రూ.5వేలు కట్టాల్సి ఉండగా, రీయింబర్స్మెంట్ ఉండి, కాలేజీ ఫీజు అంతకంటే అధికంగా ఉన్నవారు మాత్రం ఎంత ఫీజుంటే అంత మొత్తాన్ని ట్యూషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
మొదటివిడత కౌన్సెలింగ్‌లో సీటు పొందిన వారు, మంచి కాలేజీలో లేదా నచ్చిన కోర్సులో సీటు కోసం రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. అయితే ఈ సమయంలోనే విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లోని సీటు ఇష్టమైతే.. ఫీజు చెల్లించి, రెండో విడతలో పాల్గొనవచ్చని అంటున్నారు. మొదటి విడతలో సీటు కన్ఫర్మ్చేసిన తర్వాత రెండో విడత సీటు సంతృప్తికరం అయితే ఆటోమెటిక్‌గా మొదటి విడత సీటు రద్దవుతుందని తెలిపారు. కావున విద్యార్థులు తమ అభిరుచిని బట్టి నడుచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

