Nekkonda | ఐస్‌క్రీమ్‌లో వీర్యం, మూత్రం.. నెక్కొండలో విక్రేత రోత పని
Nekkonda | ఐస్‌క్రీమ్‌ను తలుచుకుంటేనే వాంతి చేసుకునేంత పనిచేశాడో ప్రబుద్ధుడు. ఏం పైత్యమోగానీ.. ప్రజలకు అమ్మే ఐస్‌క్రీమ్‌లో తన వీర్యాన్ని, మూత్రాన్ని కలిపాడు.
- వీడియో వైరల్.. నిందితుడి అరెస్ట్
- శాంపిల్స్ సేకరించిన ఫుడ్ ఇన్స్పెక్టర్
నెక్కొండ, మార్చి 19: ఐస్‌క్రీమ్‌ను తలుచుకుంటేనే వాంతి చేసుకునేంత పనిచేశాడో ప్రబుద్ధుడు. ఏం పైత్యమోగానీ.. ప్రజలకు అమ్మే ఐస్‌క్రీమ్‌లో తన వీర్యాన్ని, మూత్రాన్ని కలిపాడు. ఈ దారుణాన్ని చాటుగా సెల్ఫోన్లో చిత్రీకరించిన ఓ వ్యక్తి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. సదరు ప్రబుద్ధున్ని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా నెక్కొండలో రాజస్థాన్‌కు చెందిన కాలురాం పుర్బియా అనే వ్యక్తి ఐస్‌క్రీమ్ బండి పెట్టుకున్నాడు. అంబేద్కర్ కూడలిలో రోజూ ఐస్‌క్రీమ్‌లు విక్రయిస్తుంటాడు. బహిరంగంగానే తన వీర్యాన్ని, మూత్రాన్ని ఐస్‌క్రీమ్‌లో కలుపుతుండగా ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఇది సోమవారం రాత్రి వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఎస్సై మహేందర్ విచారణ చేపట్టి బహిరంగ ప్రదేశంలో హేయమైన చర్యకు పాల్పడ్డ కాలురాం పుర్బియాను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వరంగల్ జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ చేపూరి కృష్ణమూర్తి ఐస్‌క్రీమ్ బండికి సంబంధించిన శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు తరలించారు. పంచాయతీ కార్యదర్శి సదానందంతో కలిసి ఐస్‌క్రీమ్ బండిలోని ఐటమ్స్‌ను బయట పారబోయించారు. ఈ సందర్భంగా సీఐ చంద్రమోహన్ మాట్లాడుతూ.. బండ్లపై ఐస్‌క్రీమ్‌లు, తినుబండారాలు విక్రయించేవారు ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నవారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బయట పదార్థాలకు దూరం గా ఉంటేనే మంచిదని తెలిపారు. నెక్కొండలో ఐస్‌క్రీమ్‌లు అమ్మేవారిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి హెచ్చరికలు జారీచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

