సైనిక విమానాల్లో ఆక్సిజన్ ట్యాంకర్లు
- దేశంలోనే తొలిసారి వాయుసేన విమానాలు వాడిన రాష్ట్ర సర్కార్
- హైదరాబాద్ నుంచి ఒడిశాకు 8 ట్యాంకర్లు
- ఆక్సిజన్ నింపుకొని అవి తిరుగు పయనం
- 27న రాష్ర్టానికి చేరనున్న ఆక్సిజన్ ట్యాంకర్లు
- పర్యవేక్షించిన మంత్రి ఈటల, సీఎస్ సోమేశ్
- అందనున్న 150 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్
- ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఎలాంటి
- చర్యలకైనా ప్రభుత్వం సిద్ధం: మంత్రి ఈటల

రాష్ట్రంలో ప్రాణవాయువు కొరత ఏర్పడకుండా తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొంటున్నది. ఒడిశా నుంచి అందాల్సిన ఆక్సిజన్‌ను త్వరగా రాష్ర్టానికి చేర్చేందుకు దేశంలోనే తొలిసారిగా సైనిక రవాణా విమానాల సేవలను వినియోగించుకొంటున్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): కరోనా బాధితులకు అవసరమైన ఆక్సిజన్ కోసం తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఎనిమిది ట్యాంకర్లను సైనిక విమానాలు ద్వారా ఒడిశాలోని లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్‌కు పంపించింది. వీటిలో మూడు ట్యాంకర్లు సాయంత్రానికే 150 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నింపుకొని తెలంగాణకు తిరుగు పయన మయ్యాయి. ఈ మూడు ట్యాంకర్లు ఆదివారానికి రాష్ర్టానికి చేరుకుంటాయి. మిగతా ట్యాంకర్లు ఈ నెల 27లోగా రోడ్డు మార్గంలో తిరిగి రాష్ర్టానికి వస్తాయి. వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఇతర అధికారులు బేగంపేట విమానాశ్రయంలో విమానాల ద్వారా ట్యాంకర్లను పంపే ప్రక్రియను పర్యవేక్షించారు. వింగ్ కమాండర్ చైతన్య నిజ్హవాన్ ఆధ్వర్యంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు సీ-17 ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఇందుకు వినియోగించారు.
రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకొనేందుకైనా వెనుకాడదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవతో ఆక్సిజన్ సరఫరా కోసం సైనిక రవాణా విమానాలను ప్రయత్నమని కొనియాడారు. సైనిక రవాణా విమానాల్లో 8 ట్యాంకర్లను ఒడిశాకు పంపించామని చెప్పారు. ఆ రాష్ట్రంలోని అంగుల్, రూర్కెలా స్టీల్ప్లాంట్ల నుంచి ఈ ట్యాంకర్లు 150 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను నింపుకొని రోడ్డుమార్గంలో ఈ నెల 27లోగా తెలంగాణకు చేరుకుంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వల్ల మూడు రోజుల సమయం ఆదా కావడంతోపాటు, ప్రజల విలువైన ప్రాణాలను కాపాడిన వారమవుతామని తెలిపారు. 22 ప్రభుత్వ దవాఖానల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులను ఏర్పాటుచేశామని, ముందుచూపుతో తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రభుత్వ దవాఖానల్లో ఎకడా ఆక్సిజన్ కొరత రాలేదని మంత్రి గుర్తుచేశారు.
కేటీఆర్ అభినందన
సైనిక రవాణా విమానాల ద్వారా అక్సిజన్ అందించే చర్యలను పర్యవేక్షించిన మంత్రి ఈటల, సీఎస్ సోమేశ్‌ను మంత్రి కేటీఆర్ ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ అభినందించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత రాకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ శ్రమిస్తున్నారని మంత్రి కేటీఆర్ ట్వీట్‌చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

