Barrelakka | వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తా: బర్రెలక్క
Barrelakka | ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోలేదని, ప్రజల మనసులు గెలిచానని కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిన శిరీష (బర్రెలక్క) చెప్పారు. స్వతంత్య్ర అభ్యర్థిగా 6 వేల ఓట్లు సాధించడమంటే ప్రజల మనసుల్లో తాను ఉన్నట్లేనని అన్నారు.
కొల్లాపూర్: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోలేదని, ప్రజల మనసులు గెలిచానని కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిన శిరీష (బర్రెలక్క) చెప్పారు. స్వతంత్య్ర అభ్యర్థిగా 6 వేల ఓట్లు సాధించడమంటే ప్రజల మనసుల్లో తాను ఉన్నట్లేనని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి తనకు కేవలం ఏడు రోజులే సమయం దొరికిందని, ఈ ఏడు రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు వెళ్లలేకపోయానని తెలిపారు.
అదేవిధంగా తనపై తప్పుడు ప్రచారం జరగడం, తన వయస్సు చిన్నది కావడంతో సరిగా పనిచేయలేనేమోనని ప్రజలు భావించడం, పోలింగ్‌కు ఏడు రోజుల ముందే నామినేషన్ వేసినందున తనను నమ్మేందుకు ప్రజలకు తగినంత సమయం దొరకకపోవడం తన ఓటమికి కారణాలని చెప్పారు. ఎన్నికల ఓడినా నిరుద్యోగల పక్షాన తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు.
కాగా, నిరుద్యోగుల సమస్యలపై పోరాటం కోసం అంటూ శిరీష (బర్రెలక్క) ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు. ఆదివారం వెల్లడైన ఫలితాల్లో ఆమె 5,754 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు 93,609 ఓట్లతో విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డికి 63,678, బీజేపీ అభ్యర్థి అల్లేని సుధాకర్ రావుకు 20,389 ఓట్లు వచ్చాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

