Blood Bank | రక్తంతో వ్యాపారం.. హైదరాబాద్‌లో అక్రమాలకు పాల్పడుతున్న 9 బ్లడ్ బ్యాంకులు
మనిషికి ప్రాణాధారమైన రక్తాన్ని సక్రమంగా నిల్వ చేయకుండా, అధిక ధరలు వసూలు చేస్తూ అక్రమ వ్యాపారం చేస్తున్న బ్లడ్‌బ్యాంకుల గుట్టును డీసీఏ అధికారులు రట్టు చేశారు.
- షోకాజ్ నోటీసులు జారీ చేసిన డీసీఏ అధికారులు
Blood Bank | హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): మనిషికి ప్రాణాధారమైన రక్తాన్ని సక్రమంగా నిల్వ చేయకుండా, అధిక ధరలు వసూలు చేస్తూ అక్రమ వ్యాపారం చేస్తున్న బ్లడ్‌బ్యాంకుల గుట్టును డీసీఏ అధికారులు రట్టు చేశారు. హైదరాబాద్‌లోని 9 బ్లడ్ బ్యాంకులపై గురువారం డీసీఏ (డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్) అధికారులు ఒక్కసారిగా దాడులు చేశారు. ఈ బ్లడ్ బ్యాంకులు రక్తాన్ని సేకరించడం మొదలు అన్ని దశల్లోనూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నట్టు గుర్తించామని డీసీఏ డీజీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. 9 బ్లడ్ బ్యాంకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు. నిబంధనల ప్రకారం రక్తాన్ని సేకరించిన తర్వాత హెచ్ఐవీ, హెపటైటిస్ బీ, సీ, సిఫిలిస్, మలేరియా వంటి టెస్టులు చేయాల్సి ఉంటుంది. దాతల పేర్లు, వారి రక్త పరీక్షల వివరాలను కచ్చితంగా రికార్డుల్లో నమోదు చేయాలి. అయితే కొన్నింటిలో రికార్డుల నిర్వహణ సరిగా లేదని గుర్తించామని డీజీ తెలిపారు. ఏవీఎస్, వివేకానంద బ్లడ్ సెంటర్లలో సేకరించిన రక్తాన్ని పరీక్షించేందుకు టెస్టింగ్ కిట్స్ కూడా లేవని చెప్పారు.
అధిక ధరలకు విక్రయం
కొన్ని బ్లడ్ బ్యాంకులు రక్తం ఉత్పత్తులను అధిక ధరలకు అమ్ముతున్నారని అధికారులు గుర్తించారు. ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మా (ఎఫ్ఎఫ్పీ)ను గరిష్ఠంగా రూ.400కు అమ్మాలి. కానీ బాలాజీ బ్లడ్ సెంటర్లో ఏకంగా రూ.1500, నందిని బ్లడ్ సెంటర్లో రూ.1400కు అమ్ముతున్నట్టు అధికారులు గుర్తించారు. సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్స్‌ను రూ.11 వేలకు అమ్మాల్సి ఉండగా, బాలాజీ బ్లడ్ సెంటర్లో రూ.15 వేలు వసూలు చేస్తున్నట్టు నిర్ధారించారు.
నిపుణులు లేరు.. పరికరాలూ లేవు!
కొన్ని బ్లడ్ బ్యాంకులలో పరికరాలు కూడా సరిగా పనిచేయడం లేదని అధికారులు గుర్తించారు. ప్రతిమ సాయి బ్లడ్ సెంటర్లో డీప్ ఫ్రీజర్లలో సరైన ఉష్ణోగ్రత పాటించడం లేదని అధికారులు తెలిపారు. ప్రతిమతోపాటు వివేకానంద బ్లడ్ బ్యాంకులో నిపుణులు, నర్సింగ్, ఇతర సిబ్బంది లేనే లేరని చెప్పారు. ఏవీఎస్ బ్లడ్ సెంటర్లో రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదని తేల్చారు. ఈ నేపథ్యంలో 9 బ్లడ్ బ్యాంకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు కమలాసన్‌రెడ్డి తెలిపారు. బ్లడ్ బ్యాంకులు కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పారు.
నోటీసులు జారీ అయిన బ్లడ్ బ్యాంకులివే..
1) శ్రీ బాలాజీ బ్లడ్ సెంటర్, నల్లగొండ క్రాస్‌రోడ్, మలక్‌పేట
2) నవ్‌జీవన్ బ్లడ్ సెంటర్, కమలానగర్, చైతన్యపురి
3) ఏవీఎస్ బ్లడ్ సెంటర్, లక్డీకపూల్
4) రుధిర వాలంటరీ బ్లడ్ సెంటర్, లిబర్టీ రోడ్, హిమాయత్‌నగర్
5) ప్రతిమసాయి బ్లడ్ సెంటర ఓల్డ్ ల్యాన్సర్ లైన్స్, శ్రీకర హాస్పిటల్ పక్కన, సికింద్రాబాద్
6) తలసేమియా రక్షిత వాలంటరీ బ్లడ్ బ్యాంక్, పుత్లిబౌలి క్రాస్‌రోడ్, కోఠి
7) వివేకానంద బ్లడ్ సెంటర్, అయోధ్యనగర్ కాలనీ, మెహదీపట్నం
8) నందిని బ్లడ్ సెంటర్, బాలానగర్ క్రాస్‌రోడ్స్
9) ఎంఎస్ఎన్ బ్లడ్ సెంటర్, ఉప్పల్ క్రాస్‌రోడ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

