డామిట్.. కథ అడ్డం తిరిగింది!

- రంగురాళ్ల కేసులో కొత్త మలుపు
- జ్యోతిష్యుడి ఇంట్లో 18 కోట్ల నకిలీ కరెన్సీ పట్టివేత
- ఏడుగురు నిందితుల అరెస్టు
హైదరాబాద్ సిటీబ్యూరో/మన్సూరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): రంగురాళ్ల వ్యాపారినంటూ జనాన్ని మోసగిస్తున్న జ్యోతిష్యుడికి ‘రంగు’పడింది. ఖరీదైన రంగారాళ్లు చోరీకి గురయ్యాయం టూ ఆయన చేసిన ఫిర్యాదుపై ఆరాతీస్తే నకిలీ నోట్ల గుట్టు రట్టయింది. ఈ వ్యవహారంపై రాచకొండ సీసీఎస్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు జరిపి ఏడుగురిని అరెస్టుచేశారు. వారినుంచి దాదాపు రూ.18 కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకొన్నారు. రాచకొండ క్రైమ్ డీసీపీ యాదగిరి వివరాల ప్రకారం.. ఏపీకి చెందిన బెల్లంకొడ మురళీకృష్ణశర్మ హైదరాబాద్‌లోని నాగోల్ బృందావన్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. తాను జ్యోతిష్యుడినని చెప్పి రంగురాళ్ల వ్యాపారం చేస్తున్నట్లు ప్రచారం చేసుకొన్నాడు. దీంతోపాటు ట్రేడ్ ప్రాఫిట్ ఫండ్ వ్యాపారం చేస్తున్నట్లు కూడా నమ్మబలికాడు.
ఈక్రమంలో మురళీకృష్ణకు బంధువు నాగేంద్రప్రసాద్ ద్వారా పరిచయమైన పవన్ అనే వ్యక్తిని ఉద్యోగంలో పెట్టుకున్నాడు. తన వద్ద భారీగా నగదు ఉన్నదని మురళీకృష్ణ చాలామందికి చూపిస్తుండటంతో ఆ డబ్బును కాజేయాలని పవన్‌కు ఆశ పుట్టింది. ఈ విషయాన్ని నాగేంద్రప్రసాద్తోపాటు తన స్నేహితులు డీ రామకృష్ణ, ఎన్ సురేశ్‌గోపి, కే సూర్యం, సీహెచ్ విజయ్‌కుమార్‌కు చెప్పి చోరీకి స్కెచ్‌వేశాడు. అనంతరం ఈ నెల 15 రాత్రి 10:15 గంటలకు వీరంతా మురళీకృష్ణ ఇంట్లోకి ప్రవేశించి రెండు బ్యాగ్‌లలో ఉన్న నగదుతో ఉడాయించారు. చౌటుప్పల్ దాటిన తర్వాత ఆ బ్యాగ్ల్లోని నగదును తనిఖీ చేయగా కేవలం 16 నోట్లే అసలైనవని, మిగిలినవి నకిలీ నోట్లని తేలింది. దీంతో వాటిని వాడపల్లి వద్ద తగలబెట్టారు. మరోవైపు తన ఇంట్లో రంగురాళ్లతోపాటు కొంత నగదు చోరీ జరిగిందంటూ మురళీకృష్ణ ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దర్యాప్తు జరిపి పోలీసులు బుధవారం పవన్‌తోపాటు ఐదుగురిని పట్టుకొన్నా రు. మురళీకృష్ణ ఇంట్లో చోరీచేసింది నకిలీ కరెన్సీ అని వారు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. మురళీకృష్ణను ప్రశ్నించడంతో నకిలీ కరెన్సీతో చేస్తు న్న మోసాలు బట్టబయలయ్యాయి. మురళీకృష్ణను అరెస్టు చేసి 17.72 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ, రూ.6 లక్షల నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు.
గతంలోనే సీబీఐ కేసు
ట్రేడ్ ప్రాఫిట్ ఫండ్ వ్యవహరంలో మురళీకృష్ణపై గతంలోనే సీబీఐ కేసు నమోదు చేసింది. మోసపూరితంగా ఆయన రూ.100 కోట్లు కూడబెట్టినట్లు తేలడంతో ఆ నగదును ఫ్రీజ్ చేసింది. అయినప్పటికీ మురళీకృష్ణ తన బ్యాంకు ఖాతాలో రూ.100 కోట్లు ఉన్నాయని నమ్మబలుకుతూ చాలామంది నుంచి లక్షల రూపాయలను కాజేసి జల్సా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mohammed Shami: టెస్టు క్రికెట్‌కు అల్విదా ప్రకటించిన బౌలర్ షమీ.. వీడియో
Doodimetla Balaraj Yadav | కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ.. దూదిమెట్లకు బెయిల్ మంజూరు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

