30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ఆశపడే మధ్యతరగతి ప్రజలకు, ముఖ్యంగా చిన్న ప్లాట్ల యజమానులకు అడ్డంకులు ఎదురవుతున్నాయి.
- వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్
- బిల్డ్ నౌ నిబంధనలతో చిన్న ప్లాట్లకు చిక్కులు!
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ఆశపడే మధ్యతరగతి ప్రజలకు, ముఖ్యంగా చిన్న ప్లాట్ల యజమానులకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఇంటి స్థలం 20 ఫీట్ల కంటే వెడల్పు త క్కువ ఉన్న చిన్న ప్లాట్లలో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ‘బిల్డ్ నౌ’ పోర్టల్ చుకలు చూ పిస్తున్నది. తెలంగాణ బిల్డింగ్ నిబంధనలు, సె ట్బ్యాక్ రూల్స్ పేరుతో ఆన్లైన్ దరఖాస్తులు వరుసగా తిరసరణకు గురవుతుండటంతో ఆందోళన చెందుతున్నారు.
ఇలాంటి చిన్న ప్లాట్లకు సంబంధించిన పర్మిష న్లు ఎందుకు తిరస్కరణకు గురవుతున్నాయి? సాఫ్ట్‌వేర్‌లో ఎందుకు మార్పులు చేయడం లేదనేది చర్చనీయాంశంగా మారింది. ప్లాట్ వెడల్పు 18 ఫీట్లు మాత్రమే ఉంటే ఇల్లు కట్టుకోవడం కత్తి మీద సామే. భవన నిబంధనల ప్రకారం 100 చదరపు గజాల లోపు ప్లాట్‌కు కూడా చుట్టూ ఖాళీ స్థలాలు(సెట్‌బ్యాక్స్) వదలాలి. రోడ్డు వైపు కనీసం 4.9ఫీట్లు(1.5 మీటర్లు) ఖాళీగా వదలాల్సి ఉంటుంది. ఇరువైపులా సైడ్ సెట్‌బ్యాక్ పోను, మిగిలే స్లాబ్ వెడల్పు చాలా త కువగా ఉంటుంది.
ఈ నిబంధనలు పాటించకుండా ప్లాన్ సబ్మిట్ చేస్తే, బిల్డ్ నౌ సిస్టమ్‌లో దరఖాస్తులను తిరస్కరిస్తున్నది. ముఖ్యంగా రోడ్డు వెడల్పు నిబంధన 30 ఫీట్లు తప్పనిసరి చేయడంతో చిన్న ప్లాట్ల యజమానులు చుక్క లు చూస్తున్నారు. దీంతో 18-50 ఫీట్ల కొలతలు (అంటే 900 చదరపు అడుగులు/100 చదరపు గజాలు)తో హైదరాబాద్‌లో ఇల్లు క ట్టాలంటే ప్లాట్ ముందున్న రోడ్డు వెడల్పు అ త్యంత కీలకమైంది. ప్లాట్ ఉన్న కాలనీ లేదా వీధిలోని రోడ్డు కనీసం 30 ఫీట్లు ఉండాలనే నిబంధన ఉన్నది. ఒకవేళ రోడ్డు వెడల్పు 20 లేదా 25 ఫీట్లు మాత్రమే ఉంటే, అంతస్తులు పెంచడానికి బిల్డ్ నౌలో ఆప్షన్ కనిపించకుండా, పర్మిషన్ హోల్డ్‌లో అని చూపిస్తున్నది.
చిన్న ప్లాట్లపై సర్కార్ గురి
ఎల్ఆర్ఎస్ లేకుండా లే అవుట్‌లోని ప్లాట్ దరఖాస్తు ముందుకు కదలదు. అనధికారిక ప్లాట్లను అడ్డుకునే లక్ష్యంతో కాంగ్రెస్ సర్కార్ చిన్న ప్లాట్ల యజమానులపై గురిపెట్టింది. అంతస్తుల సంఖ్య, ఎత్తు పరిమితి కూడా 100 గజాల ప్లాట్‌లో సాధారణంగా కేవలం గ్రౌండ్+1 అంతస్తు, గరిష్ఠంగా 9 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే నిబంధనల ప్రకారం అనుమతి ఉంటుంది. దీనికి మించి జీ+2, జీ+3 అంతస్తుల కోసం ఆశపడి ప్లాన్ ఇస్తే, చిన్న ప్లాట్ కావడంతో సాఫ్ట్వేర్ తిరస్కరిస్తున్నది.
కొత్త ఆన్లైన్ సిస్టమ్ నిబంధనల పేరిట పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్లాట్ల యాజమానులను సర్కార్ వేధింపులకు గురిచేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతుల కోసం తెచ్చిన బిల్డ్ నౌ పోర్టల్‌లో సాఫ్ట్వేర్ ఆటోమేటిక్‌గా అన్ని రూల్స్‌ను సాన్ చేస్తున్నది. సెట్‌బ్యాక్స్, రోడ్డు వెడల్పు వంటివి సరిగ్గా సరిపోకపోతే సాఫ్ట్వేర్ ఆటోమాటిక్‌గా పర్మిషన్ను తిరసరిస్తున్నది. పరిషారం తెలియక, సమస్యల నుంచి బయటపడేందుకు సర్టిఫైడ్ లైసెన్స్ ఆరిటెక్ట్, టౌన్ ప్లానింగ్ కన్సల్టెంట్ల చుట్టూ తిరుగాల్సి వస్తున్నది.
టీఎస్ బీపాస్‌తో సులభతరం
టీఎస్ బీపాస్ కంటే మెరుగైన విధానాన్ని, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను తీసుకొచ్చామంటూ బీరాలుపోయిన ప్రభుత్వం… పరుగెత్తే గుర్రం కాళ్లను విరిచినట్లుగా బిల్డ్ నౌ తీసుకొచ్చి వేధింపులకు గురిచేస్తున్నది. బడా రియల్ఎస్టేట్ వ్యాపారులకు రెడ్‌కార్పెట్ పరిచిన కాంగ్రెస్ సర్కార్… చిన్న ప్లాట్లకు నిబంధనల పేరిట సొంతింటి కలలను దూరం చేస్తున్నది. 15 రోజుల్లో డీమ్డ్ అనుమతులతో చిన్న ప్లాట్లకు ఇచ్చే అనుమతుల వ్యవస్థను నిర్వీర్యం చేసిన రేవంత్ సర్కార్.. సంస్కరణల పేరిట నిర్మాణ రంగాన్ని గందరగోళంలో పడేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

