హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ): ఈ నెల 15న ప్రత్యేక పాస్పోర్ట్ ప్రత్యేక డ్రైవ్ ఉంటుందని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దానికోసం 5 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, 14 పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో అపాయింట్మెంట్స్ అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. జూలై 29న మినహాయించి ఆగస్టు 5 వరకు ప్రతీ శనివారం ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని తెలిపారు. వచ్చే శనివారం డ్రైవ్ అపాయింట్మెంట్స్ వివరాలను బుధవారం సాయంత్రం 4:30 గంటలకు విడుదల చేస్తామని, సాధారణ, తత్కాల్, పీసీసీలో మొత్తం 3,715 అందుబాటులో ఉంటాయని తెలిపారు. దరఖాస్తుదారులు మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోవద్దని పేర్కొన్నారు.