Home
Telangana
Hyderabad Gymnast Aruna Reddy Won Two Medals At The Haraohs Cup International Artistic Tournament
అరుణారెడ్డి స్వర్ణ సంబురం

- ఈజిప్టు టోర్నీలో రెండు పసిడి పతకాలు
హైదరాబాద్: ఈజిప్టు రాజధాని కైరో వేదికగా జరిగిన హార్హోస్ కప్ అంతర్జాతీయ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ టోర్నీలో రాష్ట్ర యువ జిమ్నాస్ట్ అరుణారెడ్డి రెండు స్వర్ణ పతకాలతో మెరిసింది. సోమవారం జరిగిన మహిళల ఫ్లోర్, వాల్ట్ ఈవెంట్లలో అద్వితీయ ప్రదర్శనతో అరుణ పసిడి పతకాలు కొల్లగొట్టింది. 2018లో మెల్బోర్న్లో జరిగిన ప్రపంచకప్‌లో పతకం (కాంస్యం) సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా చరిత్ర లిఖించిన అరుణ.. గత కొంత కాలంగా గాయాలతో సతమతమవుతున్నది. 2019లో కుడికాలుకు శస్త్రచికిత్స తర్వాత ఇటీవలే పూర్తిగా కోలుకున్న ఈ స్టార్ జిమ్నాస్ట్ అద్భుతంగా పుంజుకుంది. ఈజిప్టు టోర్నీకి ముందు ఢిల్లీలో మనోజ్ రాణా దగ్గర శిక్షణ తీసుకున్న అరుణ పూర్తి ఫిట్నెస్తో బరిలోకి దిగి పసిడి పతకాలను ముద్దాడింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
KTR | 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు.. తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

